బాన్సువాడ : ప్రకృతి పరిరక్షణ కోసం సీడ్ గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించాలని బాన్సువాడ ఆర్డీవో రవీందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో రూపొందించిన సీడ్ గణేష్ విగ్రహాలను ఆర్డీవో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీడ్ వినాయక విగ్రహాలను పూజించాలని, వినాయక నిమజ్జనం అయ్యాక కూడా ఇంట్లో మొకై ్క ఆశీర్వాదిస్తుందన్నారు. అనంతరం డీఎస్పీకి విఠల్‌రెడ్డికి, మున్సిపల్ కమిషనర్ గంగాధర్‌కు సీడ్ గణపతి విగ్రహాలను అందజేశారు. బీఆర్‌ఎస్ నాయకులు అంజిరెడ్డి, బాడి శ్రీనివాస్, ఎర్రవాటి సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.


