తల్లిదండ్రుల ఆశయసాధనకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల ఆశయసాధనకు కృషి చేయాలి

Sep 12 2026 1:30 AM | Updated on Sep 12 2026 1:30 AM

బాన్సువాడ/ఎల్లారెడ్డి : తల్లిదండ్రుల ఆశయ సాధన కోసం విద్యార్థులు కృషి చేయాలని జిల్లా ఇంటర్‌ నోడల్‌ అధికారి సలాం అన్నారు. శుక్రవారం బాన్సువాడ ప్రభుత్వ బాలికల, ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో నిర్వహించిన ఫ్రెషర్స్‌ పార్టీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అ తిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు బాగా చ దివి ప్రయోజకులు కావాలన్నారు. గతేడాది ఇంట ర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో అత్యుత్తమ మా ర్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. విద్యార్థునులు చేసిన నృత్యాలు అలరించాయి. ప్రిన్సిపల్‌ అసద్‌ఫారూక్‌, అధ్యాపకులు ఉన్నారు.

‘మానవీయ విలువలు,

ఉన్నత లక్ష్యంతో సిద్ధంగా ఉండాలి’

కామారెడ్డి అర్బన్‌: విద్యార్థులు మానవీయ విలువలు, ఉన్నత లక్ష్యంతో పోటీ ప్రపంచానికి సిద్ధంగా ఉండాలని కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ కే.విజయ్‌కుమార్‌ అన్నారు. కళాశాల డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థుల ఫ్రెషర్స్‌ డే క్యాంపస్‌ కార్నివాల్‌ చింతల బాల్‌రాజ్‌గౌడ్‌ ఆడిటోరియంలో శుక్రవారం ఉల్లాసంగా నిర్వహించారు. కళాశాల గౌరవానికి భంగం కలుగకుండా విద్యార్థులు తమ తల్లిదండ్రులు, కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని చదవే లక్ష్యంగా ఉండాలని ప్రిన్సిపల్‌ సూచించారు. వైస్‌ ప్రిన్సిపల్‌ కిష్టయ్య, సమన్వయకర్తలు సుధాకర్‌, విశ్వప్రసాద్‌, జయప్రకాష్‌, దినకర్‌, రాములు, శ్రీనివాస్‌రావు, రాజ్‌గంభీర్‌రావు, చంద్రశేఖర్‌గౌడ్‌, తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement