బాన్సువాడ రూరల్: వరిపంటలో వచ్చే చీడపీడలు, నివారణకు రైతులు వెంటే సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని దేశాయిపేట్ క్లస్టర్ ఏఈవో దత్తేశ్వరి అన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని రాంపూర్ తండాలో బ్యాక్టీరియా, ఎండాకు తెగులు ఆశించిన వరిపొలాలను సందర్శించారు. వాతావరణంలో ఉష్ణోగ్రతల మార్పుల కారణంగా ఎండాకు తెగులు పంటకు ఆశిస్తుందన్నారు. దీని నివారణకు రైతులు ప్లాంటమైసిన్ 100గ్రాములు, కాపర్ ఆక్సిక్లోరైడ్ 400గ్రాముల మిశ్రమాన్ని ఒక ఎకరానికి పిచికారి చేయాలన్నారు. రైతులు హరిసింగ్, కేతావత్ మోహన్, కిషన్ తదితరులు ఉన్నారు.
కంది పంటలో మొగ్గ తొలిచే దశపై అవగాహన
పిట్లం : మండలంలోని బుర్నాపూర్ గ్రామ శివారులో శుక్రవారం కంది పంటలో మొగ్గ తొలిచే దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంట యాజమాన్య పద్ధతులపై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. ఆత్మ సౌజన్యంతో కంది పంటలో మొగ్గ తొలిచే దశలో మొక్కల పెరుగుదల, పూత, కాయల ఏర్పాటుకు అనుకూలంగా తీసుకోవాల్సిన చర్యలను రైతులకు వివరించారు. శాసీ్త్రయ పద్ధతులను పాటిస్తూ కంది పంటలో అధిక దిగుబడులు సాధించాలన్నారు. ఏఈవో సురేశ్, మండల వ్యవసాయ అధికారి బి.వినోద్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి
మద్నూర్ : ఎల్‌నినో ప్రభావంతో రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని ఏఈవో రాజహిత సూచించారు. మండలంలోని సుల్తాన్‌పేట్‌లో శుక్రవారం రైతుబడి కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ రాజేశ్వర్‌గౌడ్, రైతులతో కలిసి గ్రామ శివారులోని వరి పంటను ఆమె పరిశీలించారు. వరి పంటలో తీసుకోవాల్సిన మెలకువలను వివరించారు.


