ఎల్లారెడ్డిరూరల్/నిజాంసాగర్/లింగంపేట/నాగిరెడ్డిపేట/దోమకొండ/బీబీపేట: వినాయక చవితిని పురస్కరించుకుని శుక్రవారం పలు పాఠశాలలో విద్యార్థులు మట్టి గణపతులను తయారు చేసి అందరికి పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించుకోవాలని సూచించారు. లింగంపేట మండలంలో మహిళా సంఘాలు, ఆయా శాఖల అధికారులకు ఎంపీడీవో మలహరి మట్టి గణపతులు పంపిణీ చేశారు. దోమకొండ మండల పరిషత్ కార్యాలయంలో మండలానికి చెందిన ప్రజాప్రతినిధులకు మండల ప్రత్యేకాధికారి, జిల్లా ఉద్యానశాఖ అధికారి జ్యోతి మట్టి గణపతులు అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులు దోపదపడతాయని ఆమె అన్నారు.


