విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

Sep 12 2026 1:30 AM | Updated on Sep 12 2026 1:30 AM

కామారెడ్డి టౌన్‌ : సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు డిమాండ్‌ చేశారు. పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ తెలంగాణ ప్రాంతం నిజాం నిరంకుశ పా లనలో మగ్గిపోయిందని, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చేపట్టిన సైనిక చర్య ఫలితంగానే 1948 సెప్టెంబర్‌ 17న తెలంగాణకు విముక్తి లభించిందని గుర్తుచేశారు. బీజేపీ మున్సిపల్‌ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దార్లకు వినతిపత్రం

అందజేసిన బీజేపీ నాయకులు

నిజాంసాగర్‌/నస్రుల్లాబాద్‌ : ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిం చాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం మహమ్మద్‌ నగర్‌, నస్రుల్లాబాద్‌ తహసీల్దార్లకు బీజేజీ నాయకులు వినతిపత్రం అందజేశారు. మండల కేంద్రంలో తహశీల్దార్‌ ఎస్‌. లతకు బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. బీజేపీ మండల అధ్యక్షుళ్లు శ్రీకాంత్‌, చందూరి హన్మండ్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement