‘మాజీ’లలో చిగురించిన ఆశలు | - | Sakshi
Sakshi News home page

‘మాజీ’లలో చిగురించిన ఆశలు

Sep 11 2026 9:52 AM | Updated on Sep 11 2026 9:52 AM

‘మాజీ’లలో చిగురించిన ఆశలు

అప్పులపాలు

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మాజీ సర్పంచ్‌లలో ఆశలు చిగురిస్తున్నాయి. 2024 ఫిబ్రవరి 1 కన్నా ముందు గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్‌ బిల్లుల వివరాలను పంచాయతీ కార్యదర్శులు లాగిన్‌లో నమోదు చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల్లో పెండింగ్‌ బిల్లుల వివరాలను సేకరించి నమోదు చేశారు.

పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం 2024 ఫిబ్రవరి ఒకటో తేదీలో ముగిసింది. అంతకుముందు సర్పంచ్‌లుగా ఉన్నవారు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈజీఎస్‌, ఎస్‌ఎఫ్‌సీ, 15వ ఆర్థిక సంఘం, ఏసీడీపీ, ఎంపీ లాడ్‌, ఎస్‌డీఎఫ్‌, ఎండీఎఫ్‌, జీపీ జనరల్‌ ఫండ్‌ తదితర నిధులతో చేపట్టిన పనులకు బిల్లులు రాకపోవడంతో మాజీ సర్పంచ్‌లు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. బిల్లుల కోసం పలుమార్లు ఆందోళనలు కూడా చేపట్టారు. అయినప్పటికీ బిల్లుల చెల్లింపులు జరగకపోవడంతో ఆర్థికంగా చితికిపోయారు. అయితే పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు జిల్లా పంచాయతీ అధికారులకు ఇటీవల ఒక సర్క్యులర్‌ జారీ చేశారు. గ్రామాల వారీగా పెండింగ్‌ బిల్లుల వివరాలను పంచాయతీ కార్యదర్శులకు కేటాయించిన ప్రత్యేక లాగిన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో ఆయా గ్రామాల కార్యదర్శులు గురువారం వివరాలను సేకరించి నమోదు చేయడంలో బిజీ అయ్యారు. గ్రామంలో పని పేరు, ఫండ్‌ వివరాలు, అడ్మినిస్ట్రేటివ్‌ సాంక్షన్‌ అథారిటీ, అంచనా వ్యయం, పని పూర్తయ్యిందా, వర్క్‌ రికార్డు చేసింది ఎవరు అన్న వివరాలను లాగిన్‌లో నమోదు చేస్తున్నారు.

ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా కేటా యించిన నిధులతో గ్రామాల్లో డ్రెయినేజీలు, సీ సీరోడ్ల నిర్మాణాలు చేపట్టారు. అలాగే తాగునీటి పథకాలకు సంబంధించి పైపులైన్లు, బోర్ల తవ్వ కం, మోటార్ల బిగింపు.. ఇలా వివిధ రకరకాల ప నులు పూర్తి చేశారు. పనులు చేస్తే నాలుగు డబ్బు లు మిగులుతాయని ఆశపడితే ఏళ్లుగా బిల్లులు రాకపోవడంతో పెట్టిన పెట్టుబడులకు వడ్డీలు పెరిగిపోయి అప్పులపాలయ్యారు. ఒక్కొక్కరికి రూ. 2లక్షలనుంచి రూ. 20 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. బిల్లుల రాకపోవడంతో అప్పులు తీర్చేందుకు కొందరు సర్పంచ్‌లు ఆస్తులు కూడా అమ్ముకున్న ఉదంతాలున్నాయి. ఓ యువ సర్పంచ్‌ ఎంతో ఉత్సాహంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేసి తన ఊరును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాడు. అయితే చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో వారసత్వంగా వచ్చిన భూమిని అమ్ముకున్నాడు. ఇలా ఎందరో మాజీ సర్పంచ్‌లు అప్పులపాలై అనేక అవస్థలు పడ్డారు. పంచాయతీల్లో పెండింగ్‌ బిల్లులపై కదలిక రావడంతో మాజీ సర్పంచ్‌లలో ఆశలు చిగురించాయి. ఇప్పటికై నా బిల్లులు వస్తే కాస్త ఉపశమనం లభిస్తుందని మాజీ సర్పంచ్‌లు అంటున్నారు.

పెండింగ్‌ బిల్లులపై కదలిక

గ్రామాలవారీగా

వివరాలు కోరిన ప్రభుత్వం

పంచాయతీ కార్యదర్శుల

లాగిన్‌లో నమోదు..

త్వరగా మంజూరు చేయాలని

కోరుతున్న మాజీ సర్పంచ్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement