రైస్‌మిల్‌ పరిశ్రమను కాపాడాలి | - | Sakshi
Sakshi News home page

రైస్‌మిల్‌ పరిశ్రమను కాపాడాలి

Sep 11 2026 9:52 AM | Updated on Sep 11 2026 9:52 AM

రైస్‌మిల్‌ పరిశ్రమను కాపాడాలి

కామారెడ్డి క్రైం: దాడులు ఆపడంతోపాటు చర్చలు, తగిన చర్యలు తీసుకొని కష్టాల్లో ఉన్న రైస్‌మిల్‌ పరి శ్రమను ప్రభుత్వమే కాపాడాలని ఆలిండియా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ మాజీ సెక్రెటరీ వడ్డీ మోహ న్‌ రెడ్డి అన్నారు. జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట తలపెట్టిన రెండు రోజుల నిరసన కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ రైతు బాగుండాలని తాము కోరుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైస్‌మిల్లు పరిశ్రమ సంక్షోభంలో ఉందన్నారు. మిల్లర్లపై ఇష్టారాజ్యంగా దాడులు చేయడం, జైల్లో పెడితే సహించేది లేదన్నారు. రైతు సంక్షేమానికి కట్టుబడి అనేక సందర్భాల్లో తడిసిన, చెడిపోయిన ధాన్యాన్ని సైతం నష్టానికి అనుమతించిన విషయాన్ని గుర్తించాలన్నారు. బకాయిల పేరిట మిల్లర్లపై దాడులు చేయడం, కేసులు పెట్టడం సరికాదన్నారు. ఇది కచ్చితంగా కక్ష్యసాధింపు చర్యేనని ప్రభుత్వం తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2014 నుంచి 2024 వరకు ప్రభుత్వం మ్తొతం 9.70 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మరాడించడానికి ఇవ్వగా, ఇప్పటివరకు 9.60 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి సంబంధించిన బియ్యం ప్రభుత్వానికి తిరిగి ఇచ్చామన్నారు. 10 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే పెండింగ్‌లో ఉందని, కేవలం 2 శాతం ఉన్న మిల్లర్ల బకాయిలకు పీడిస్తున్నారని విమర్శించారు. వచ్చే డిసెంబర్‌ 31 వరకు గడువు పొడిగిస్తే పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లిస్తామన్నారు. చివరి గింజ వరకు బియ్యం అప్పగించాకే ప్రభుత్వం మళ్లీ సీఎంఆర్‌ కోసం ధాన్యం ఇవ్వాలన్నారు. అంతేకాకుండా క్వింటాలు వడ్లకు 67 కిలోల బియ్యం రావడం లేదని, ఈ అంశంపై నిజ నిర్ధారణ కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజేంద్ర ప్రసాద్‌, సంతోష్‌ కుమార్‌, కోశాధికారి సుదర్శన్‌, ప్రతినిధులు కంచర్ల లింగం, గౌరీ శంకర్‌, శ్రీనివాస్‌ రెడ్డి, భూమేశ్‌ గుప్తా, లక్ష్మణ్‌, రైస్‌మిల్లర్లు పాల్గొన్నారు.

బకాయిల చెల్లింపునకు

డిసెంబర్‌ 31 వరకు గడువు పెంచాలి

ఆలిండియా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌

మాజీ సెక్రెటరీ వడ్డీ మోహన్‌ రెడ్డి

కలెక్టరేట్‌ ఎదుట రైస్‌మిల్లర్స్‌

అసోసియేషన్‌ ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement