నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు | - | Sakshi
Sakshi News home page

నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు

Sep 11 2026 8:16 AM | Updated on Sep 11 2026 8:16 AM

రోడ్డు ప్రమాదాలను నివారించాలి

ఎస్పీ రాజేశ్‌ చంద్ర

నిజాంసాగర్‌: నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాజేశ్‌ చంద్ర అన్నారు. గురువారం నిజాంసాగర్‌ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. పోలీస్‌ స్టేషన్‌ భవనాన్ని, స్ట్రాంగ్‌ రూం గదులను పరిశీలించారు. స్టేషన్‌లో రిజిస్టర్ల నిర్వహణ, రోల్‌ కాల్‌, సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందించాలన్నారు. గణేశ్‌ ఉత్సవాలకు పటిష్టమైన చర్యలు తీసుకోవా లని సూచించారు. బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి, బాన్సువాడ రూరల్‌ సీఐ తిరుపతయ్య, ఎస్సై శివకుమార్‌, ఏఎస్సై నర్సయ్య తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement