నాగిరెడ్డిపేట: ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టుపై ప్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు గురువారం అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి భూసేకరణ లేకుండా ప్రాజెక్టులపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన అన్నారు. తమ ప్రాంతం వ్యవసాయాధారితమైనందున టీజీరెడ్కో, టీజీ జెన్కో ద్వారా సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయించాలని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే సూచనలపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ మైనర్, మీడియం, మేజర్ ప్రాజెక్టులపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటును అంశాన్ని పరిశీలిస్తామన్నారు. మాల్తుమ్మెద వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను పునరుద్ధ్దరించాలని ఎమ్మెల్యే మదన్‌మోన్‌రావు కోరారు. మాల్తుమ్మెద శివారులో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను 2014లో ఏర్పాటు చేశారన్నారు.
● ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు


