కామారెడ్డి రూరల్: వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రూరల్ సీఐ శ్రీధర్‌గౌడ్, ఎస్‌ఐ రంజిత్‌లు సూచించారు. గురువారం కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామంలో గణేశ్ మండపాల నిర్వహకులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన, భక్తిశ్రద్ధలతో కూడిన వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. సర్పంచ్ అడప శ్యామ్, వార్డు సభ్యులు, గణేశ్ మండపాల నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
పెద్దకొడప్‌గల్: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్సై అరుణ్ కుమార్ సూచించారు.గురువారం మండల కేంద్రంలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్సై అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. ప్రధానోపాధ్యాయురాలు కమల, ఉపాధ్యాయులు కిషోర్,నాగనాథ్ తదితరులు పాల్గొన్నారు.


