మట్టి గణపతులనే ప్రతిష్ఠించాలి | - | Sakshi
Sakshi News home page

మట్టి గణపతులనే ప్రతిష్ఠించాలి

Sep 11 2026 8:16 AM | Updated on Sep 11 2026 8:16 AM

బాన్సువాడ:మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని ప్రధానోపాధ్యాయులు విజయ్‌కుమార్‌ అన్నారు. గురువారం పట్టణంలోని కోన బాన్సువాడ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మట్టి గణపతుల తయారీపై పోటీలు నిర్వహించారు. విద్యార్థులకు మట్టి గణపతుల ప్రతిమాలను అందజేశారు. ఉపాధ్యాయులు రవీంద్రనాథ్‌ఆర్య, నాయిని రాములు, తదితరులు ఉన్నారు.

లింగంపేట : పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులనే ప్రతిష్ఠించాలని లింగంపేట యువ యూత్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షుడు బొల్లు శ్రీకాంత్‌ పిలుపునిచ్చారు. గురువారం ఆయన లింగంపేటలో మాట్లాడారు. గత 16 సంవత్సరాల నుంచి మంట్టి గణపతులు తయారు చేసి ఉచితంగా ఇంటింటికి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ‘యువతా మేలుకో–సమాజ సేవకు పూనుకో’ అనే నినాదంతో సమాజానికి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది 1500 మట్టి గణపతులను సొంత ఖర్చులతో తయారు చేసి ఇంటింటికి అందజేస్తున్నట్లు తెలిపారు. యూత్‌ ఆర్గనైజేషన్‌ సభ్యులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement