నిజాంసాగర్ : దళితులను బీఆర్‌ఎస్ నాయకులు చులకనగా చూడాల్సిన అవస రం ఏమోచ్చిందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆరోపించారు. దళితుడు స్పీకర్‌గా ఉన్నాడన్న కారణంగానే ప్రతి పక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదన్నారు. గురువారం హైదరాబాద్‌లో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. స్పీకర్‌పై బీఆర్‌ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారని, స్పీకర్ అంటే బీఆర్‌ఎస్‌కు అంత అక్కసు ఏముందన్నారు. దళితులు నడిచిన నేలను పసువు నీళ్లు, పాలతో శుద్ధ్ది చేసి, కుల దుర అహంకారాన్ని మరొకసారి గట్టిగా చాటుకున్న విషయం తెలిసిందన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు తమ ఆలోచన విధానాన్ని మార్చుకునే పరిస్థితుల్లో లేరన్నారు. బీఆర్‌ఎస్ దళితులను దగా, మోసం చేసిందని, దళితున్ని సీఎం చేస్తానని కేసీఆర్ సీఎం అయ్యాడన్నారు. గవర్నర్‌కు వెళ్లి బీఆర్‌ఎస్ నాయకులు ఫిర్యాదు చేయడాన్ని స్వాగతిస్తున్నానని, కేసీఆర్ అసెంబ్లీకి ఎందకు రావడం లేదని సుమోటోగా తీసుకొని విచారణ జరుపాలన్నారు.
● జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు


