సంక్షిప్తం.. | - | Sakshi
Sakshi News home page

సంక్షిప్తం..

Sep 10 2026 1:03 AM | Updated on Sep 10 2026 1:03 AM

పాఠశాలలకు చెస్‌ బోర్డుల పంపిణీ

మాచారెడ్డి: చెస్‌ నెట్‌వర్క్‌ అసోసియేషన్‌ (కాకతీయ చెస్‌ బాక్స్‌) సౌజన్యంతో, చెస్‌ నెట్‌వర్క్‌ ఫౌండర్‌ సుధీర్‌ కోదాటి సహకారంతో మాచారెడ్డి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మాచారెడ్డి మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 120 చెస్‌ బోర్డులను అందజేశారు.ఈ సందర్భంగా మండల విద్యాధికారి దేవేందర్‌ రావు మాట్లాడారు. చెస్‌ ఆటతో విద్యార్థులకు ఏకాగ్రత, సజనాత్మకత పెరుగుతాయన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయ సౌత్‌ క్యాంపస్‌ అధ్యాపకుడు డాక్టర్‌ ఎస్‌. నారాయణగుప్తా పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు అశోక్‌ కుమార్‌, పీజీహెచ్‌ఎంలు రాజేశ్వర్‌ రెడ్డి, వెంకటాచారి, టీచర్లు ఉన్నారు.

స్టడీ మెటీరియల్‌ ..

తాడ్వాయి: మండలంలోని ఎండ్రియాల్‌ పాఠశాల విద్యార్థులకు హెల్ఫింగ్‌బ్రిడ్జ్‌ ఎడ్యూకేషన్‌ సంస్థ ప్రతినిధులు సంతోష్‌కుమార్‌, కృష్ణాకర్‌రావు స్టడీ మెటీరియల్‌ అందజేశారు. ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష రాస్తున్న విద్యార్థులకు జూకంటి అనిల్‌ రెడ్డి ఆర్థిక సహాయంతో స్టడీ మెటీరియల్‌ అందజేశామని వారు పేర్కొన్నారు.

స్మార్టు రేషన్‌ కార్డులు..

భిక్కనూరు/పెద్దకొడప్‌గల్‌: భిక్కనూరులో లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌కార్డులను సర్పంచ్‌ రేఖ అందించారు. పెద్దకొడప్‌గల్‌ మండలం కాటేపల్లిలో లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను తహసీల్దార్‌ రాజశేఖర్‌ పంపిణీ చేశారు.

విద్యార్థులకు దుస్తులు..

పిట్లం/నిజాంసాగర్‌/కామారెడ్డి రూరల్‌: పిట్లం మండలం చిన్నకొడఫ్గల్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు సర్పంచ్‌ కిరణ్‌కుమార్‌ రెడ్డి ఏకరూప దుస్తులు, బూట్లు, సాక్సులను పంపిణీ చేశారు. మహమ్మద్‌నగర్‌ మండలం గున్కుల్‌ ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్‌ గంగి రమేశ్‌యాదవ్‌ విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని అడ్లూర్‌ ఉన్నత పాఠశాలలో వార్డు కౌన్సిలర్‌ గడ్డమీద మహేశ్‌ విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు.

డ్రెయినేజీ నిర్మాణ పనుల పరిశీలన

లింగంపేట : మండలంలోని శెట్పల్లి గ్రామంలో డ్రెయినేజీ నిర్మాణం పనులను బుధవారం ఎంపీడీవో మలహరి పరిశీలించారు. పనులు నాణ్యతగా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అట్టెం శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ మన్నె బాలయ్య, సెక్రెటరీ రవి, ఉన్నారు.

ఇందిరమ్మ గృహ ప్రవేశం

ఎల్లారెడ్డిరూరల్‌: ఎల్లారెడ్డి మండలంలోని అడివిలింగాల గ్రామంలో లబ్ధిదారు పోలీస్‌ కిరణ్‌కుమార్‌ ఇందిరమ్మ ఇంటిని బుధవారం ఎంపీడీవో తాహేరాబేగం ప్రారంభించారు. అనంతరం కొక్కొండలో నిర్మిస్తున్న మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను పరిశీలించారు. సర్పంచ్‌ సంతోష్‌కుమార్‌, పంచాయతి కార్యదర్శి జ్యోతి తదితరులున్నారు.

ప్రీప్రైమరీ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

సదాశివనగర్‌ : మండలంలోని ధర్మారావ్‌పేట్‌ గ్రామంలో ప్రీప్రైమరీ పాఠశాలను ఎంఈవో యోసెఫ్‌ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రాథమిక స్థాయి విద్యను బలోపేతం చేయడానికి ఈ పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పూర్వ విద్యార్థి, పాఠశాల సేవకుడు రామాంజనేయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఉపాధి నిధులను సద్వినియోగం చేసుకోవాలి

బాన్సువాడ రూరల్‌: ఉపాధి నిధులతో గ్రామాల్లో సోక్‌పిట్‌లు, పాంపౌండ్‌లు, మ్యాజిక్‌డ్రైన్‌లు నిర్మించుకోవాలని బాన్సువాడ ఎంపీడీవో ఆనంద్‌ సూచించారు.మండలంలోని ఇబ్రహీంపేట్‌ తండా పంచాయతీ పరిధిలోని కృష్ణనగర్‌ తండా, ఇబ్రహీంపేట్‌ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఒక్కో ఫాంపౌండ్‌కు ప్రభుత్వం 1.5లక్షలు మంజూరు చేస్తోందన్నారు. సర్పంచ్‌ స్వరూప వసంత్‌, జీపీకార్యదర్శి సాయికుమార్‌, నాయకులు ఉన్నారు.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో

డిజిటల్‌ బోధన

రామారెడ్డి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు డిజిటల్‌ బోధన అందుబాటులోకి వచ్చిందని కళాశాల ప్రిన్స్‌పాల్‌ నారాయణ తెలిపారు. డిజిటల్‌ బోధన ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంటుందన్నారు.

ప్రమోషన్లు పొందిన

గెజిటెడ్‌ అధికారులకు టీజీవో సన్మానం

కామారెడ్డి అర్బన్‌: పశుసంవర్థకశాఖ జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప్రమోషన్‌ పొందిన టీజీవో జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌.దేవేందర్‌, భిక్కనూర్‌ ఎంపీడీవోగా ప్రమోషన్‌ పొందిన సవితను బుధవారం తెలంగాణ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం (టీజీవో) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. టీజీవో నాయకులు సాయిరెడ్డి, భూమయ్య, రాజలింగం, ప్రశాంత్‌రెడ్డి, లక్ష్మణ్‌, వెంకటేశం తదితరులున్నారు.

ఉత్తమ ఉపాధ్యాయులకు...

మాచారెడ్డి: మండలంలోని ఆయా పాఠశాలలకు చెందిన 27 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు బుధవారం సన్మానం చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి దేవేందర్రావు మాట్లాడుతూ... ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను పేరుపేరునా అభినందించారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మంజుశ్రీ వెంకటాచారి వెంకట రమణాచారి ఉపాధ్యాయ సంఘం నాయకులు రూప్‌ సింగ్‌ నరేందర్‌ సురేందర్‌ సరోజినీ ఉన్నారు. అలాగే జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న సుర భాస్కర్‌ గోపాల్‌ పాత అశోక్‌ సంయుక్త రాణి సౌజన్యలను అధికారులు అభినందిస్తూ సన్మానం చేశారు.

ఉత్తమ ప్రిన్సిపల్‌కు..

తాడ్వాయి: రాష్ట్రస్థాయిలో ఇటీవల ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా ఉత్తమ ప్రిన్సిపల్‌ గా అవార్డు అందుకున్న తాడ్వాయి ప్రిన్సిపల్‌ టి. శ్రీనివాసరావును బుధవారం తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అధ్యాపకులు, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులు ఘనంగా సన్మానం చేశారు. ఆయనకు శాలువా కప్పి పూలమాలతో సత్కరించి మెమొంటోను అందజేశారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మెడికల్‌ సీటు సాధించిన విద్యార్థినికి ..

బాన్సువాడ : కరీంనగర్‌ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు సాధించిన బీర్కూర్‌కు చెందిన ఎర్రోళ్ల గంగాలతకు బుధవారం లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో బీర్కూర్‌లో సన్మానించారు. లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు మేత్రి కిరణ్‌, సీతలే రమేష్‌, మేకల విఠల్‌, సంతోష్‌, కార్తీక్‌, మేరు భరత్‌, సాయిప్రకాష్‌, మాజీ ఎంపీటీసీ విరేశం తదితరులు ఉన్నారు.

సర్పంచ్‌ల ముందస్తు అరెస్టు

కామారెడ్డి రూరల్‌: అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతున్న బీఆర్‌ఎస్‌ పార్టీ మండల సర్పంచులను పోలీసులు బుధవారం తెల్లవారుజామున దేవునపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడమేనని బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లు ఆకుల శ్యామ్‌, చిందం మల్లేష్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంగన్‌వాడీ కార్యకర్తలు..

ఎల్లారెడ్డిరూరల్‌: అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు బుధవారం ముందస్తు అరెస్టు చేశారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించే ఉద్యోగుల నిరసన కార్యక్రమానికి తరలివెళ్లకుండా ఉండేందుకు గాను మండలంలోని అంగన్‌వాడీ ఉపాధ్యాయులు దేవకర్ణ, లలిత, నీలారాణి తదితరులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు.

హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలి

ఎల్లారెడ్డి: అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని అంబేడ్కర్‌ యువజన సంఘం నాయకులు బుధవారం ఎల్లారెడ్డి ఎస్సై రాజుకు వినతిపత్రం అందించారు. బబ్లూ, సాయిబాబా, సాయిలు తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement