పాత పెన్షన్‌ అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పాత పెన్షన్‌ అమలు చేయాలి

Aug 24 2026 1:01 AM | Updated on Aug 24 2026 1:01 AM

కామారెడ్డి అర్బన్‌ : ఉద్యోగుల పాలిట పెనుశాపంగా మారిన సీపీఎస్‌ విధానం రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. పీఆర్‌సీ, 6 పెండింగ్‌ డీఏల బకాయిలతోపాటు పెండింగ్‌ బిల్లుల ను చెల్లించాలని పేర్కొన్నారు. టీఎన్జీవోస్‌ కామారెడ్డి జిల్లా భవనంలో ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించగా కార్య దర్శి ముల్క నాగరాజు అజెండా అంశాలను చదివి వినిపించగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఉద్యోగుల ఆరోగ్య బీమా కార్డులను వెంటనే అందజేయాలని కోరా రు. ఉద్యోగ విరమణ చేస్తున్న వారి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో టీఎన్జీవోస్‌ రాష్ట్ర సభ్యుడు కే శివకుమార్‌, అసోసియేట్‌ అధ్యక్షుడు చక్రధ ర్‌, కోశాధికారి దేవరాజు, కార్యవర్గసభ్యులు, తాలూకా అధ్యక్షులు, ప్రతినిధులు శ్రవణ్‌కుమార్‌, రాజ్యలక్ష్మి, రమణకుమార్‌, రాజారె డ్డి, రాజమణి, సంతోష్‌కుమార్‌, రాజ్‌కుమా ర్‌, దత్తాద్రి, మహిపాల్‌, శరణ్‌, శ్రీనివాస్‌ రెడ్డి, సృజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘సాగర్‌’లోకి 1,069 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

నిజాంసాగర్‌(జుక్కల్‌): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఆదివారం సాయంత్రం నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 1,069 క్యూసెక్కుల వరద వస్తోందని అధికారులు తెలిపారు. క్యాచ్‌మెంట్‌ ఏరియాలో వర్షాలు దంచికొడుతుండటంతో ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోందని పేర్కొన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు 17.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1400. 88 అడుగుల (12.330 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement