● రూ.41 వేల ఆర్థిక సహాయం అందజేత
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్‌పేటకు చెందిన బోయిని యాదగిరికి తోటి మిత్రులు అండగా నిలిచారు. విద్యుదాఘాతానికి గురై దీనస్థితిలోకి మారిన యాదగిరి కుటుంబ పరిస్థితిపై ‘సాక్షి’ దినపత్రికలో ‘ఆమే వెన్నెముక’ శీర్షికతో జూలై 12న ప్రచురితమైన కథనానికి అతనితో కలిసి చదువుకున్న మిత్రులు స్పందించారు. గోపాల్‌పేట హైస్కూల్ 2008–09 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు తలాకొంత డబ్బులు జమచేశారు. ఆదివారం యాదగిరి ఇంటికి చేరుకొని రూ.41వేల నగదును అందజేశారు. తమ స్నేహం పాఠశాల రోజులకే పరిమితం కాకుండా కష్టకాలంలోనూ ఒకరికొకరు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.


