నిజామాబాద్ అర్బన్: నగరంలోని రైల్వేస్టేషన్‌లో శుక్రవారం ఓ రైలులో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ స్వప్న తెలిపారు. వివరాలు ఇలా.. షిర్డీ వెళ్లే రైలులో తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించగా ఒడిశాకు చెందిన గణేశ్, దీపక్ సాహూ అనే ఇద్దరు వ్యక్తుల వద్ద 24.3 కేజీల గంజాయి పట్టుబడిందన్నారు. వారిని విచారించగా.. ఒడిశా నుంచి మహారాష్ట్రలోని షిర్డీకి రవాణా చేస్తున్నట్లు ఒప్పుకున్నారన్నారు. గుర్తుతెలియని వ్యక్తి వారికి గంజాయి సూట్‌కేసులు, రూ. 10 వేలు ఇచ్చి షిర్డీలోని ఓ ప్రాంతంలో ఆటో ఆగి ఉంటుందని, ఆ ఆటోలో గంజాయి పెట్టి రావాల్సిందిగా తెలిపినట్లు వెల్లడించారు. నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకొని అరెస్టు చేశామన్నారు. రైల్వే ఆర్పీఎఫ్ పోలీసులతోపాటు ఎకై ్సజ్ పోలీసులు మల్లేశ్, వెంకటేశ్వర్లు, శైలేశ్, సలీం, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.


