పెండింగ్‌ బకాయిలను విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ బకాయిలను విడుదల చేయాలి

Aug 22 2026 1:41 AM | Updated on Aug 22 2026 1:41 AM

బాన్సువాడ : పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు అన్నారు. శుక్రవారం బాన్సువాడలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఫీజు బకాయి..బీజేపీ లడాయి అనే నినాదంతో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌ షిప్‌లు పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతి విద్యార్థి కి స్కాలర్‌ షిప్‌లు అందించి ఉన్నత చదువులు చదువుకునే విధంగా చూస్తామని హామీ ఇచ్చి నెరవేర్చడం లేదన్నారు. అంతకుముందు ప్రభుత్వ కళాశాల నుంచి రాజీవ్‌, తాడ్కోల్‌ చౌరస్తా, పాత అంగడిబజారు మీదుగా అంబేడ్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నంది వేణు, బీజేపీ పట్టణ అధ్యక్షులు కోనాల గంగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పైడిమల్‌ లక్ష్మినారాయణ, శంకర్‌గౌడ్‌, చిరంజీవి, ఉమేష్‌, గజ్జల మహేష్‌, సాయికిరణ్‌, చందూరి హన్మండ్లు, శ్రీనివాస్‌, బీజేవైఎం నాయకులు నరేందర్‌, చంద్రశేఖర్‌, చీకట్ల రాజు, పాశం భాస్కర్‌రెడ్డి, కొండని గంగారం, రాజాసింగ్‌, విశాల్‌, పురుషోత్తం, ప్రదీప్‌, ప్రసాద్‌, సాయిరెడ్డి, యోగి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement