సంక్షిప్తం.. | - | Sakshi
Sakshi News home page

సంక్షిప్తం..

Aug 22 2026 1:41 AM | Updated on Aug 22 2026 1:41 AM

బంగారు గాజులు చోరీ ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడి మృతి మద్నూర్‌లో ముగ్గురిపై కుక్కల దాడి పచ్చని పంట పొలంపై గడ్డిమందు!

ఇసన్నపల్లి మీదుగా జేబీఎస్‌కు బస్సు

భిక్కనూరు: బీబీపేట నుంచి ఇస్సానగర్‌, కంచర్ల, పెద్దమల్లారెడ్డి, ఇసన్నపల్లి, రామాయంపేట మీదు గా జేబీఎస్‌ వెళ్లే ఆర్టీసీ బస్సు శుక్రవారం ఇసన్నపల్లి గ్రామానికి వచ్చింది. సర్పంచ్‌ మేకల రాములు ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆర్టీసీ బస్సుకు స్వాగతం పలికి డ్రైవర్‌,కండక్టర్‌లను సన్మానించారు. ఈ సందర్బంగా సర్పంచ్‌ మేకల రాములు మాట్లాడుతూ ఈబస్సు కోసం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీని కలిసి ఇటీవల విన్నవించామన్నారు. ఉపసర్పంచ్‌ రాజమణి,వార్డు సభ్యులు పాల్గొన్నారు.

పాస్ట్‌ ప్యాసింజర్‌ రైల్‌ను తిప్పాపూర్‌లో ఆపాలి

భిక్కనూరు: నిజామాబాద్‌ నుంచి కాచిగూడకు వెళ్లే పాస్ట్‌ ప్యాసింజర్‌ రైల్‌ (77602)ను భిక్కనూరు మండలం తిప్పాపూర్‌ రైల్వేస్టేషన్‌లో ఆపాలని సర్పంచ్‌ కుంట లింగారెడ్డి సికింద్రబాద్‌ రైల్వే కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలసుబ్రహ్మణానికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. కాచిగూడ నుంచి నిజామాబాద్‌కు వెళ్లే సమయంలో ఈ రైల్‌ తిప్పాపూర్‌లో ఆగుతుందని నిజామాద్‌ నుంచి కాచిగూడ వెళ్లే సమయంలో ఆగకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మాజీ సర్పంచ్‌ కోక స్వామి డీసీ మాజీ అధ్యక్షుడు ఆకుల రాములు, యువజన కాంగ్రెస్‌ గ్రామశాఖాధ్యక్షుడు కిషన్‌లు ఉన్నారు.

చైతన్య అవగాహన కార్యక్రమం

కామారెడ్డి అర్బన్‌: ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 6 నుంచి 8గంటలు నిద్ర పోవాలని, ఒత్తిడిని తగ్గించుకుని భావోద్వేగాలను ఇతరులతో పంచుకోవాలని, అవసరమైనప్పుడు నిపుణుల సహాయం పొందాలని తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్‌క్యాంపస్‌ సామాజిక సేవా విభాగాధిపతి అంజయ్య బండేలా అన్నారు. జాతీయ సామాజిక సేవా వారోత్సవం సందర్భంగా కామారెడ్డిలో చైతన్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతినిధులు రవికుమార్‌, కృష్ణ, సలావుద్దీన్‌, శ్రీనివాస్‌, వెంకటలక్ష్మి, అఖిల, నిరోషా, లత, నవ్య, మనీష, వనిత, నాగరాజు తదితరులున్నారు.

ఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

తాడ్వాయి : మండలానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తాడ్వాయిలో శుక్రవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే మరిన్ని అభివృద్ధి పనులు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు సంజీవులు, నాయకులు పాల్గొన్నారు.

చదువుపై దృష్టి కేంద్రీకరించాలి

పిట్లం : మండల కేంద్రంలో హరిజనవాడలో ఏఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు అయ్యల సంతోష్‌ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు అయ్యల సంతోష్‌ మాట్లాడుతూ యువత చెడు మార్గంలో వెళ్లకుండా గంజాయి, డ్రగ్స్‌ ఇతర మత్తు పానీయాలకు బానిసలు కావద్దని, చదువు పైన దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. అనంతరం బుర్నాపూర్‌ గ్రామానికి చెందిన గైని ప్రమోద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో సీటు సాధించడంతో అతడ్ని సన్మానించారు. ఫౌండేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

కామారెడ్డి టౌన్‌ : ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ కాసర్ల గోదావరి పిలుపునిచ్చారు. వనమహోత్సవం భాగంగా శుక్రవారం మున్సిపల్‌ పరిధిలోని 12వ వార్డులో కాలనీవాసులకు మొక్కలను పంపిణీ చేసి, మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడారు. కౌన్సిలర్లు లక్ష్మణ్‌, ఎజాజ్‌, మున్సిపల్‌ డీఈ హనుమంతరావు నాయక్‌, టీపీవో వినీత్‌, నాయకులు పాల్గొన్నారు.

బీబీపేట: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎంపీడీవో గంగాధర్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని యాడారం గ్రామంలో హరితహారంలో భాగంగా ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు. సర్పంచ్‌ సుధారాణి బాపురెడ్డి, కార్యదర్శి వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి రూరల్‌: మున్సిపల్‌ పరిధిలోని 10వ వార్డు ప్రజలకు కౌన్సిలర్‌ కాసర్ల మాధవి రవీందర్‌

మొక్కలు పంపిణీ చేశారు. డీఈ హనుమంత్‌రావు నాయక్‌, ఏఈ వేణుప్రసాద్‌, పాల్గొన్నారు.

మొక్కలు నాటిన ఎకై ్సజ్‌ అధికారులు

లింగంపేట : మండలంలోని పర్మళ్ల గ్రామ శివారులోని ఊర చెరువు కట్టపై శుక్రవారం ఎకై ్సజ్‌ అధికారులు ఈత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎకై ్సజ్‌ సీఐ షకీర్‌అహ్మద్‌ మాట్లాడారు. సర్పంచ్‌ గడ్డం బాబాయినరేష్‌, కార్యదర్శి నరేష్‌, సీజీఆర్‌ఎఫ్‌ మెంబర్‌ రాజాగౌడ్‌, ఆర్టీఐ రాష్ట్ర కార్యదర్శి లెగ్గల రాజు, ఎఫ్‌ఏ లక్ష్మణ్‌, చందు, ప్రభురాజు, బాలకిషన్‌, సాయిలు, సాయిబాబు, ఎకై ్సజ్‌ సిబ్బంది సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.

అథ్లెటిక్స్‌ పోటీల్లో విద్యార్థినుల ప్రతిభ

సదాశివనగర్‌ : మండలంలోని మర్కల్‌ స్టేజీ వద్ద గల గురుకుల మహిళ డిగ్రీ కళాశాల విద్యార్థినులు కామారెడ్డిలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపాల్‌ శోభారాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎం.మహేశ్వరీ(బీఏ ఫస్టియర్‌) షాట్‌ఫుట్‌లో రజత పతకం, స్వప్న(బీకాం ఫస్టియర్‌) జావెలిన్‌త్రోలో కాంస్య పతకం, సంజీవని ఎంపీసీ(సెకండియర్‌) 100 మీటర్ల పరుగుపందెంలో స్వర్ణపతకం, కె దివ్య ఎంఎస్‌డీస్‌(థర్డియర్‌) 100 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం, సీహెచ్‌. వైష్ణవి డిస్కస్‌ త్రోలో స్వర్ణపతకం, సరిత(బీఏ సెకండియర్‌) రజత పతకం, నవ్యశ్రీ జావెలిన్‌త్రోలో ప్రహర్ష లాంగ్‌జంప్‌లో, స్వర్ణ పతకం, అరుణ షాట్‌పుట్‌లో కాంస్యపతకం, సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైస్‌ ప్రిన్సిపాల్‌ కృష్ణవేణి,పీడీ రమాదేవి, అధ్యాపకులు విద్యార్థినులను అభినందించారు.

దోమకొండ: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికైన దోమకొండ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిని నిహరికను ప్రిన్సిపల్‌ చైతన్యసుధ, అధ్యాప కులు అభినందించారు. నిహరికను శాలువాతో సన్మానించారు. 20న కామారెడ్డిలో జరిగిన పోటీల్లో ఆమె ప్రఽథమ స్థానం సాధించింది. 26న హన్మకొండలో జరిగే పోటీల్లో పాల్గొననుంది.

క్రైం కార్నర్‌

పోతే‘ఫోన్‌’లే అనుకుంటే డబ్బు కూడా పోయింది

రూ.2.21 లక్షలు కాజేసిన

సైబర్‌మోసగాళ్లు

ఆలస్యంగా గుర్తించిన బాధితుడు

రూ.1.51 లక్షలు ఫ్రీజ్‌

నందిపేట్‌(ఆర్మూర్‌): స్మార్ట్‌ఫోన్‌ పోగొట్టుకున్న ఓ వ్యక్తి పోనీలే అనుకుంటే సైబర్‌ నేరస్తులు అతని బ్యాంకు ఖాతాను ఖాళీ చేశారు. ఆలస్యంగా గుర్తించిన బాధితుడు 1930 టోల్‌ఫ్రీకి ఫిర్యాదు చేయగా కొంత నగదును ఫ్రీజ్‌ చేశారు. నందిపేట ఎస్సై వినయ్‌ తెలిపిన వివరాలు ఇలా.. నవీపేట మండలానికి చెందిన ఓ వ్యక్తి స్మార్ట్‌ ఫోన్‌ జూలైలో నందిపేటలో చోరీకి గురైంది. బాధితుడు వెంటనే కొత్త సిమ్‌ కార్డు తీసుకొని దానిని సాధా రణ ఫోన్‌లో వినియోగించాడు. పది రోజుల తర్వాత అదే సిమ్‌ను స్మార్ట్‌ ఫోన్‌లో వేసు కొని గూగుల్‌ పే, ఫోన్‌పేలను యాక్టివ్‌ చేసు కున్నాడు. ఇంతలో తన ఖాతాలోంచి తనకు రూ.2,21,995 డెబిట్‌ అయినట్లు గుర్తించాడు. అప్రమత్తమై సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేయగా, వారు సైబర్‌ నేరగాళ్లు కాజేసిన డబ్బులో రూ.1,51,743 హోల్డ్‌ చేశారు. అనంతరం బాధితుడు గురువారం రాత్రి నందిపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని కంఠేశ్వర్‌ ప్రాంతంలో ఉంటున్న ఓ ఇంట్లో చోరీ జరిగినట్లు మూడో టౌన్‌ ఎస్సై హరిబాబు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. వృద్ధురాలైన గడ్డం సుశీల శుక్రవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గుర్తించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇందులో ఆమె చేతికి ఉన్న ఆరు బంగారు గాజులను లాక్కొని పరారయ్యారు. తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తిపై అనుమానం ఉన్నట్లు వృద్ధురాలి కుమారుడు చిట్టిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

పిట్లం: ప్రమాదవశాత్తు ఓ యువకుడు చెరువులో జారిపడి మృతి చెందిన ఘటన పిట్లం మండలం అల్లాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేకల వినయ్‌(19) శుక్రవారం ఉదయం గ్రామ శివారులోని చెరువులో తన మేకలను కడిగేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోయాడు. అతడికి ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

మద్నూర్‌: మండల కేంద్రంలోని మార్కెట్‌ కమిటీ ఎదురుగా ఉన్న కాలనీలో శుక్రవారం ముగ్గురిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కుక్కల దాడిలో కంటాలప్ప, నాందేవ్‌, స్వరూప లకు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. స్థానికులు వీరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

బాన్సువాడ రూరల్‌: మండలంలోని హన్మాజీపేట్‌ గ్రామానికి చెందిన బండారి నాగభూష ణం తన మూడు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో వరిపంటను సాగుచేశాడు. పచ్చగా కళకళ లాడుతున్న వరిపొలంపై కొందరు గడ్డిమందు స్ప్రే చేశారని ఆరోపించారు. దీని వల్ల తాను సుమారు రూ.లక్షవరకు నష్టపోయానని ఆయ న అన్నారు. ఈ విషయమై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement