జీవో– 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

జీవో– 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలి

Jul 11 2026 7:01 AM | Updated on Jul 11 2026 7:01 AM

కామారెడ్డి టౌన్‌ : చాలా ఏళ్లుగా మున్సిపల్‌లో విధులు నిర్వహిస్తున్న తమకు వేతనాలు తగ్గించి ఇవ్వడం సరికాదని మున్సిపల్‌ కంప్యూటర్‌ ఆపరేటర్లు ఆందోళన చేపట్టారు. శుక్రవారం మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ హన్మంత్‌ నాయక్‌, అకౌంటెంట్‌ రాములుతో వాగ్వాదానికి దిగారు. తమకు జీవో నంబర్‌–60 ప్రకారం రూ.22,750 వేతనం ఇప్పటి వరకు చెల్లించారని, ఇప్పుడు తగ్గించి చెల్లిస్తామనడం సరికాదన్నారు. తమకు బల్దియా కార్యాలయానికి వచ్చిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌వై గిరితో తమ సమస్యను వివరించారు. కలెక్టరేట్‌కు సాయంత్రం రావాలని సూచించడంతో కలెక్టరేట్‌కు తరలివెళ్లారు. సీఐటీయూ నాయకులు, కంప్యూటర్‌ ఆపరేటర్లు అదనపు కలెక్టర్‌తో చర్చించారు. గతంతో చెల్లించిన మాదిరిగా, వేతనాలు చెల్లించాలని ఇన్‌చార్జి కమిషనర్‌, అకౌంటెంట్‌కు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీఐటీయూ నాయకులు, సిబ్బంది అదనపు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement