● ఆర్డీవో ప్రభాకర్
ఎల్లారెడ్డి: ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించాలని ఆర్డీవో ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలోని వీకేవీ కన్వెన్షన్‌లో ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, నిజాంసాగర్, మహ్మద్‌నగర్ మండలాలకు చెందిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేళ్లకు సంబంధించిన ప్రణాళికలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సర్పంచ్‌లు, కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి, ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని అన్నారు. 16వ ఆర్థిక సంఘం నిధులను సక్రమంగా వినియోగించాలన్నారు. డీఎల్‌పీవో సురేందర్, ఎంపీడీవోలు, ఎంపీవోలు, సర్పంచులు, జీపీ కార్యదర్శులు పాల్గొన్నారు.


