రెడ్డి కార్పొరేషన్‌కు పాలకవర్గాన్ని నియమించాలి | - | Sakshi
Sakshi News home page

రెడ్డి కార్పొరేషన్‌కు పాలకవర్గాన్ని నియమించాలి

Jul 11 2026 7:01 AM | Updated on Jul 11 2026 7:01 AM

రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు

నాగర్తి చంద్రారెడ్డి

భిక్కనూరు: ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్‌కు తక్షణమే పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి రూ.వెయ్యి కోట్ల నిధులను కేటాయించాలని రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు నాగార్తి చంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం రామేశ్వర్‌పల్లిలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్‌ను ప్రకటించినప్పటికి నిధులను కేటాయించకపోవడం సమంజసం కాదన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది నిరుపేద రెడ్డి కులస్తులున్నారని, వారి అభివృద్ధికి కార్పొరేషన్‌ తోడ్పడాలని సూచించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న చంద్రారెడ్డిని నాగార్తి సంఘం ఆధ్వర్యంలో సత్కరించారు. నాగార్తి సంఘం ప్రతినిధులు భూమిరెడ్డి, పోతిరెడ్డి నరేందర్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, భూపతిరెడ్డి, రాజిరెడ్డి, రాంరెడ్డి, తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement