పది రోజుల్లో విద్యుత్‌ సమస్యకు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

పది రోజుల్లో విద్యుత్‌ సమస్యకు పరిష్కారం

Jul 11 2026 7:01 AM | Updated on Jul 11 2026 7:01 AM

విద్యుత్‌ డీఈ నంద కుమార్‌

దోమకొండ : దోమకొండలో విద్యుత్‌ సమస్యలను వారం, పది రోజుల్లో పరిష్కరిస్తామని విద్యుత్‌ శాఖ డీఈ నందకుమార్‌ అన్నారు. శుక్రవారం దోమకొండ మండల కేంద్రంలో విద్యుత్‌ సమస్యపై సర్పంచ్‌ ఐరేని నర్సయ్య వరంగల్‌ ట్రాన్స్‌కో సీఎండీ వరుణ్‌రెడ్డికి ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన ఆయన మండల కేంద్రంలో విద్యుత్‌ సిబ్బంది, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. దోమకొండ పట్టణంలో కరెంటు కోత లేకుండా ఉండేందుకు ఏబీ స్విచ్‌ ఏర్పాటు చేయాలని, దానికి అవసరమైన ప్రతిపాదనను వెంటనే తయారు చేసి వారంలోగా ఈ సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. వారం, పది రోజుల్లో కరెంటు సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. విద్యుత్‌ శాఖ ఏడీ సుదర్శన్‌రెడ్డి, నేతలు బత్తిని సిద్ధ రాములు, పాలకుర్తి శేఖర్‌, కటిక శ్రీనివాస్‌, విద్యుత్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement