చిన్నమల్లారెడ్డి పాఠశాలలో 106 మంది విద్యార్థుల చేరిక | - | Sakshi
Sakshi News home page

చిన్నమల్లారెడ్డి పాఠశాలలో 106 మంది విద్యార్థుల చేరిక

Jul 11 2026 7:01 AM | Updated on Jul 11 2026 7:01 AM

కామారెడ్డి రూరల్‌: మండలంలోని చిన్నమల్లారెడ్డి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా 106 మంది చేరడం గర్వంగా ఉందని సర్పంచ్‌ బి.లక్ష్మి, హెడ్‌మాస్టర్‌ సాయిరెడ్డి అన్నారు. శుక్రవారం పాఠశాల కొత్త విద్యార్థులతో సంబురాలు నిర్వహించారు. చిన్నమల్లారెడ్డి పాఠశాల కొత్త విద్యార్థుల చేరికలో ప్రథమ స్థానంలో ఉందని ఎంఈవో ఎల్లయ్య అన్నారు. గ్రామంలో 52 మంది విద్యార్థులు ప్రయివేట్‌ పాఠశాలలను వదిలి ప్రభుత్వ పాఠశాలలో చేరారని దీంతో మొత్తం 330 మంది విద్యార్థులయ్యారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ లక్ష్మిగౌడ్‌, మాజీ సర్పంచులు ఆనందరావు, రామాగౌడ్‌, ఉపసర్పంచ్‌ స్వప్న, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement