ఇందల్వాయి: మండలంలోని గౌరారం గ్రామ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా, ప్రజా ప్రయోజనాలకు ఆటంకం కలిగించేవిధంగా వేసిన బోరుబావిని అధికారులు బుధవారం సీజ్ చేసినట్లు సర్పంచ్ హేమలత తెలిపారు. గ్రామానికి చెందిన ఓ రైతు గ్రామ పంచాయతీ బోరు బావికి దగ్గరగా వాల్టా చట్టానికి విరుద్ధంగా బోరు వేయడంతో పంచాయతీ బోరు నుంచి నీరు రావడం తగ్గంది. ఈ విషయంపై రెవెన్యు అధికారులకు ఫిర్యాదు చేయగా జీపీవో, పంచాయతి కార్యదర్శి విచారణ చేపట్టి సదరు బోరు బావిని సీజ్ చేసినట్లు తెలిపారు.
బాన్సువాడ రూరల్: మండలంలోని బోర్లం గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌హెచ్‌వో తుల శ్రీధర్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన మన్నె గంగాధర్(33) అనే యువకుడు వృత్తిరీత్య ఫోటోగ్రాఫర్‌గా జీవనం సాగించేవాడు. కొంతకాలంగా పని లేకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. దీంతో అప్పులు పెరిగిపోవడం, గొడవలు తదితర కారణాలతో జీవితంపై విరక్తిచెందాడు. ఈక్రమంలో బుధవారం ఉదయం తన ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


