మహిళా సాధికారత సమాజాభివృద్ధికి ఎంతో కీలకం | - | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారత సమాజాభివృద్ధికి ఎంతో కీలకం

Mar 12 2026 7:42 AM | Updated on Mar 12 2026 7:42 AM

కామారెడ్డి అర్బన్‌: సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో మహిళలు చేసిన సమగ్రాభివృద్ధిని గుర్తించి అభినందించడం సంతోషంగా ఉందని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించగా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న మహిళలను సన్మానించారు. మహిళా సాధికారత సమాజాభివృద్ధికి ఎంతో కీలకమని, మహిళలు విద్య, ఉపాధి, ఆరోగ్య సేవలు, హక్కులు, భద్రత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి ప్రమీల, బిచ్కుంద మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సీమాషెట్కార్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌ భాగ్యలక్ష్మి, డీపీఆర్‌వో తిరుమల, డీఎం రమ్య, అదనపు డీఆర్‌డీవో విజయలక్ష్మి, ఐసీడీఎస్‌ సీడీపీవోలు, పర్యవేక్షకులు స్వర్ణలత, శారద, తులసి, సౌందర్య, బాల రక్షక్‌ అధికారి అరుణ్‌కుమార్‌, స్రవంతి, సఖి, చిల్డ్రన్‌హోం అధికారులు, జిల్లా స్థాయి మహిళా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement