తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఉపాధి హామీ పనులలో కూలీల శాతాన్ని పెంచాలని పీడీ సురేందర్ సూచించారు. తాడ్వాయి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు కూలీలు అధిక సంఖ్యలో హాజరయ్యేలా చూడాలన్నారు. అధికారులు ప్రతిరోజూ క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించాలన్నారు. కూలీలకు వారానికి ఒకసారి వారి ఖాతాలో డబ్బులు పడేలా చూడాలన్నారు. ఈసీ తిరుపతి, టెక్నికల్ అసిస్టెంట్ కృష్ణగౌడ్, ఆపరేటర్లు కై లాస్, రామకృష్ణ, రేఖ, ఫీల్డు అసిస్టెంట్లు పాల్గొన్నారు.
ఉపాధి పనుల పరిశీలన
లింగంపేట(ఎల్లారెడ్డి): అయిలాపూర్, రాంపల్లి, రాంపల్లి స్కూల్ తండా, కోమట్‌పల్లి గ్రామాల్లో బుధవారం ఉపాధి హామీ పనులను ఎంపీడీవో నరేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడారు. పనులు కొలతల ప్రకారం నిర్వహించాలని సూచించారు. సమయ పాలన పాటించి నాణ్యమైన పనులు చేపట్టాలన్నారు. ఆయన వెంట కార్యదర్శులు, క్షేత్రసహాయకులు, తదితరులున్నారు.


