కామారెడ్డి టౌన్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్‌రెడ్డి భౌతికకాయానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ బుధవారం నివాళులర్పించారు. అనంతరం మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోహన్ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి, జిల్లాకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఒక బలమైన, నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోయిందని, వారి కుటుంబానికి ప్రభుత్వం, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ సంతాపం వ్యక్తం చేశారు.


