బోరుబావులకు కనెక్షన్లు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

బోరుబావులకు కనెక్షన్లు ఇవ్వాలి

Mar 12 2026 7:42 AM | Updated on Mar 12 2026 7:42 AM

బోరుబావులకు కనెక్షన్లు ఇవ్వాలి లక్ష్యాన్ని సాధించేవరకు ఇష్టపడి నేర్చుకోవాలి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి పెండింగ్‌ బిల్లులు ఇప్పించాలి

మద్నూర్‌(జుక్కల్‌): మద్నూర్‌లో నెలకొన్న తాగునీటి సమస్యలను తొలగించాలంటే నూతనంగా ఇటీవల వేసిన బోరుబావులకు మోటార్లు దించి కనెక్షన్లు ఇవ్వాలని వార్డు సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా బుధవారం వార్డు సభ్యులు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీకి వెళ్లి పంచాయతీ కార్యదర్శి సందీప్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో వేసిన బోరు బావులు తవ్వి అలాగే వదిలేశారని వారు ఆరోపించారు. వార్డు సభ్యులు తుకారాం, శ్రీకాంత్‌, నరేశ్‌, నాగేశ్‌, హన్మాండ్లు, గంగాధర్‌ ఉన్నారు.

ఎల్లారెడ్డి: జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేంతవరకు ఇష్టపడి నేర్చుకోవాలని కెరీర్‌ గైడెన్స్‌ నిర్వాహకులు గంగాధర్‌ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి మోడల్‌ స్కూల్లో విద్యార్థులకు కెరీర్‌ గైడెన్స్‌, కౌన్సిలింగ్‌ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ప్రతిరోజూ అనుకున్న లక్ష్యం సాధించడం కోసం ఇష్టపడి నేర్చుకోవాలని అన్నారు. జీవితంలో లక్ష్యం పెద్దదిగా ఎంచుకోవాలని, చిన్నదిగా ఉండకూడద ని అన్నారు. ప్రపంచంలో ఉపాధికోసం ఎన్నో అవకాశాలు ఉన్నాయని, మంచి దానిని ఎంచుకోవాలని సూచించారు. టాలెంట్‌ ఉంటే ఉపా ధి వెతుక్కుంటూ వస్తుందని అన్నారు. ప్రిన్సిపాల్‌ గాంధీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బిచ్కుంద(జుక్కల్‌): మహిళలు వంట గదులకే పరిమితం కాకుండా చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించి తన సత్తాచాటాలని బిచ్కుంద మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సీమా షెట్కార్‌ అన్నారు. బుధవారం డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ సీమా షెట్కార్‌ మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగి కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళా గ్రూపులకు ఎన్నో పథకాలు అందిస్తున్నారని అన్నారు. అనంతరం ప్రిన్సిపాల్‌ మహిళలనుసన్మానించారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ భాగ్యలక్ష్మి, కౌన్సిలర్‌ కార్తిక్‌, ప్రిన్సిపాల్‌ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

మాచారెడ్డి: మన ఊరు– మన బడి కార్యక్రమంలో భాగంగా చేసిన పనులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులు ఇప్పించాలని బుధవారం మాజీ మంత్రి హరీష్‌ రావును మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు కలిశారు. అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యను లేవనెత్తాలని కోరినట్లు మాజీ సర్పంచులు అంజి నాయక్‌, శ్రీశైలం, మల్లేశం తెలిపారు. హరీష్‌ రావు సానుకూలంగా స్పందించినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement