వంద శాతం వసూలు చేస్తాం
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం నత్తనడకన సాగుతోంది. ఇప్పటి వరకు సగం కూడా వసూలు చేయలేదు.
కామారెడ్డి బల్దియాకు సంబంధించి ఈ ఏడాది ఆస్తి పన్ను డిమాండ్ మొత్తం రూ. 15.44 కోట్లు. కాగా ఇప్పటివరకు రూ. 7 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అంటే సగం లక్ష్యం కూడా చేరుకోలేదు. మరోవైపు బల్దియా రెవెన్యూ ఆఫీసర్ ఈనెల 17 వరకు సెలవులో ఉంటారు. ఆయన సెలవుపై వెళ్లి మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఇన్‌చార్జి బాధ్యతలను ఎవరికీ అప్పగించలేదు. మరోవైపు గడువు సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోపు మిగిలిన రూ. 8.44 కోట్ల పన్నులను వసూలు చేయడం బల్దియా అధికారులకు సవాల్‌గా మారింది. వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్‌లతో పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ ఆర్‌వో సెలవులో ఉండడంతో రోజువారి వసూళ్లపై పర్యవేక్షణ కొరవడింది. దీంతో మందకొడిగా వసూళ్లు సాగుతున్నాయి.
బల్దియాలో ఇంటి, కుళాయిల పన్నుల డిమాండ్ కు అనుగుణంగా వసూళ్లు వేగవంతం చేస్తాం. ప్రత్యేక బృందాలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఈ నెలాఖరు వరకు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేలా కృషి చే స్తాం. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలి.
– రాజేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్
కామారెడ్డి బల్దియాలో
రూ. 15.44 కోట్ల టార్గెట్
ఇప్పటివరకు రూ. 7 కోట్లే వసూలు
సెలవుల్లో రెవెన్యూ అధికారి..
పట్టించుకునేవారు లేక నత్తనడక


