అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

Mar 7 2026 8:20 AM | Updated on Mar 7 2026 8:20 AM

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

ఘనంగా మహిళా దినోత్సవం

కామారెడ్డి క్రైం: మహిళలు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సూచించారు. శుక్రవారం టీఎన్‌జీవోస్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళలు ప్రతి రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. ప్రభుత్వం మహిళల అభివృద్ధి, భద్రత, విద్య, ఆర్థిక స్వావలంబన కోసం అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మహిళా ఉద్యోగులను సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్‌, మధుమోహన్‌, టీఎన్‌జీవోస్‌ జిల్లా అధ్యక్షడు వెంకట్‌రెడ్డి, కార్యదర్శి నాగరాజు, ప్రతినిధులు చక్రధర్‌, శివకుమార్‌, రాజ్యలక్ష్మి, పోచయ్య, రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement