నిజాంసాగర్: వేసవిలో అడవుల రక్షణ కోసం అటవీ శాఖ సన్నద్ధం కాకపోవడంతో నిప్పుతో ముప్పు ఎదురవుతోంది. ఎండాకాలం కావడంతో ఆకులు రాలిపోయాయి. వాటిని కాల్చడం కోసం కొందరు నిప్పు పెడుతుండడంతో ఆ ప్రాంతమంతా కాలిపోతోంది. బీడీలు తాగి వాటిని పూర్తిగా ఆపకుండా నేలపై పడేస్తుండడంతోనూ అడవులకు ముప్పు ఏర్పడుతోంది. అంతేకాకుండా తునికాకు సేకరణ కోసం కాంట్రాక్టర్లు అడవుల్లోని చెత్తకు నిప్పు పెట్టడంతో అడవుల్లో మంటలు వ్యాపిస్తున్నాయి. దీంతో విలువైన వన సంపద కాలి బూడిదవుతోంది. అటవీ శాఖ అధికారులు స్పందించి అడువుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


