పరిహారంపై రైతుల్లో అసంతృప్తి
జాతీయ రహదారి కోసం సేకరించిన భూమి వివరాలు..
బాన్సువాడ : జాతీయ రహదారి పనులతో భూము లు కోల్పోయిన రైతులు.. తక్కువ పరిహారం ఇస్తుండడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరిహారం పెంచాలని కోరేందుకు కలెక్టర్‌ను కలవాలని నిర్ణయించారు. జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం పోచా రం నుంచి ఎల్లారెడ్డి, బాన్సువాడ మీదుగా నిజామాబాద్ జిల్లా రుద్రూర్ వరకు 765–డి జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు. పోచారం నుంచి రుద్రూర్ వరకు 51.66 కిలోమీటర్ల మేర రోడ్డు వేస్తున్నారు. ఈ రోడ్డును 150 ఫీట్ల వెడల్పుతో వేస్తుండడంతో రహదారి పక్కన ఉన్న భూములు పోతున్నాయి. దీని కోసం గతంతోనే భూ సేకరణ జరిపారు. ఎల్లారెడ్డి డివిజన్‌లో 16.1118 ఎకరాలు, బాన్సువాడ డివిజన్‌లో 38.2400 ఎకరాల భూమిని సేకరించారు. పలువురు వ్యవసాయ భూములు, విలువైన స్థలాలు, ఇళ్లు కోల్పోయారు. భూ సేకరణలో భాగంగా ప్రభుత్వం ఎకరానికి రూ.8.60 లక్షల పరిహారం చెల్లించింది. కానీ మార్కెట్ కంటే ఈ ధర చాల తక్కువగా ఉండడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరిహారం తక్కువగా ఉండడంతో బాధిత రైతులు కలెక్టర్‌ను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ఎకరానికి కనీసం రూ.20 లక్షలైనా పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. త్వరలోనే కలెక్టర్‌ను కలిసి తమ గోడు వినిపిస్తామని బాధిత రైతులు తెలిపారు.
మా భూముల్లోంచి జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు. నా భూమి 23 గుంటలు పోయింది. తీవ్రంగా నష్టపోయాను. ఉన్నతాధికారులు స్పందించి ఎకరానికి కనీసం రూ. 20 లక్షలైనా పరిహారం చెల్లించాలి.
– హన్మండ్లు, రైతు, తిర్మలాపూర్
ఉన్న పొలం రోడ్డులో పోయింది. ప్రస్తుతం మాకు మరే ఆధారం లేదు. ప్రభుత్వం ఎకరానికి రూ.8.60 లక్షలే చెల్లించింది. పరిహారం పెంచాలి. కలెక్టర్‌ను కలుస్తాం. కనీసం రూ.20 లక్షలు ఇవ్వాలని కోరుతాం.
– కుర్మ రమేశ్, రైతు, తిర్మలాపూర్
గ్రామం సేకరించిన భూమి
(ఎకరాల్లో..)
పోచారం 2.2843
మాల్తుమ్మెద 0.0350
నాగిరెడ్డిపేట్ 0.0300
జాన్కంపల్లి 1.0875
రాఘవపల్లి 0.0200
కన్నారెడ్డి 1.3225
మాచాపూర్ 2.1975
సఫ్‌దాల్‌పూర్ 0.2250
ఎల్లారెడ్డి 0.0475
లింగారెడ్డిపేట 1.2150
తిమ్మారెడ్డి 1.2150
మట్టడ్‌పల్లి 1.1875
అన్నసాగర్ 2.3400
గున్కుల్ 4.1700
తున్కిపల్లి 0.2700
బూర్గుల్ 10.1800
నర్వ 2.0700
ముగ్దుంపూర్ 1.2500
తిర్మలాపూర్ 7.000
తాడ్కోల్ 0.2200
బాన్సువాడ 0.1300
సోమేశ్వర్ 1.100
దుర్కి 5.0400
కంశెట్‌పల్లి 0.1100
నస్రుల్లాబాద్ 4.3900
జాతీయ రహదారి ‘765–డి’తో భూములు కోల్పోయిన రైతులు
ఎకరానికి రూ.8.60 లక్షలే
చెల్లించిన సర్కారు
ఎకరానికి రూ.20 లక్షలు
ఇవ్వాలని అన్నదాతల డిమాండ్
చలో కలెక్టరేట్‌కు సన్నద్ధం
పరిహారంపై రైతుల్లో అసంతృప్తి
పరిహారంపై రైతుల్లో అసంతృప్తి


