పర్వతారోహకురాలికి ఆర్థిక సాయం
కామారెడ్డి టౌన్: మాచారెడ్డి మండలం సోమార్‌పేటకు చెందిన పర్వతారోహకురాలు బానోత్ వెన్నెలకు బీజేపీ నేతలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈనెల 28న లేహ్ లడఖ్‌లోని 6,100 మీటర్ల ఎత్తైన పర్వతాన్ని అధిరోహించడానికి వెన్నెల సన్నద్ధమవుతోంది. ఈ యాత్రకు రూ. 5.50 లక్షలు ఖర్చవనున్నాయి. ఈ మొత్తాన్ని ఎమ్మెల్యేతోపాటు ఆయన చిన్ననాటి మిత్రులైన డాక్టర్ విజయ్, ఆనంద్, డాక్టర్ దినేశ్‌రెడ్డి, డాక్టర్ రవీందర్‌రెడ్డి, వ్యాపారవేత్త గబ్బుల శేఖర్ సమకూర్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ నాయకులు ఈ మొత్తాన్ని వెన్నెలకు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ విపుల్ జైన్, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, నాయకులు నరేందర్, సురేష్, సంతోష్‌రెడ్డి, రాజ్‌గోపాల్ పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏలు, ఇతర బిల్లులను తక్షణమే విడుదల చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సత్యానంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంఘం జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. నెలకు రూ.700 కోట్ల చొప్పున కేటాయించి జీపీఎఫ్, మెడికల్ బిల్లులు క్లియర్ చేస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరు చేయాలన్నారు. ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. కొత్త పీఆర్సీని వెంటనే ప్రకటించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు బాబు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, నాయకులు రూప్ సింగ్, ఎమీలియా, నారాయణ, బాలయ్య, సాయి గౌతమ్, నాంపల్లి, ఏసురత్నం, రాజు, రాజయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
భిక్కనూరు: మండల కేంద్రంలోని జెండా గల్లీలో ఉన్న వీరభద్రస్వామికి భక్తులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్గశిర పంచమి శతభిష నక్షత్రం సందర్భంగా భక్తులు వీరభద్రస్వామికి అర్చనలు, అభిషేకాలు జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు.
పర్వతారోహకురాలికి ఆర్థిక సాయం
పర్వతారోహకురాలికి ఆర్థిక సాయం


