రాష్ట్రస్థాయి క్రాస్‌కంట్రీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
కామారెడ్డి అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ ఎంపికలు నిర్వహించగా 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపిక పోటీలను అదనపు కలెక్టర్ మధు మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. అత్యంత ప్రతిభ చూపిన క్రీడాకారులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. జనవరి 2న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీల్లో ఎంపికై న 24 మంది క్రీడాకారులు జిల్లా తరపున పాల్గొంటారని అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.జైపాల్‌రెడ్డి, కేపీ అనిల్‌కుమార్‌లు తెలిపారు. జిల్లా క్రీడలు, యువజన అధికారి వెంకటేశ్వరగౌడ్, స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి హీరాలాల్, వ్యాయామ ఉపాధ్యాయులు మధుసూదన్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, ప్రభులింగం, విజయలక్ష్మి, సంజీవ్, లక్ష్మణ్, నరేష్, నవీన్, సురేష్ పాల్గొన్నారు.


