చెస్‌తో మేధస్సుకు పదును
● డీఈవో అశోక్
మోపాల్: విద్యార్థులు సెల్‌ఫోన్‌కు బానిసలుగా కాకుండా చెస్ వంటి క్రీడలతో వారి మేధస్సును పదును చేసుకోవచ్చని డీఈవో అశోక్ సూచించారు. మంగళవారం నగరశివారులోని బోర్గాం(పి) జెడ్పీహెచ్‌ఎస్‌లో చెస్ నెట్‌వర్క్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చెస్ బోర్డుల పంపిణీ కార్యక్రమాన్ని డీఈవో ప్రారంభించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 20 మంది విద్యార్థులకు ఒకటి చొప్పున చెస్ బోర్డులను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయులు పిల్లలను చెస్ ఆడేందుకు ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవోలు గేమ్‌సింగ్, సేవులా, పాఠశాల హెచ్‌ఎం సీహెచ్ శంకర్, నెట్‌వర్క్ ప్రతినిధులు సాహితీ, కిరణ్‌కుమార్ గౌడ్, వాసు గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


