మొక్కలు, చెట్లను కాపాడండి
భిక్కనూరు: ప్రభుత్వం మొక్కలను నాటాలని పదే పదే చెబుతుంటుంటే కొందరు చెట్లను మొక్కలను తమ అవసరాలకు నరుకుతున్నారు. భిక్కనూరు మండల కేంద్రంలో ఎల్లమ్మ గుడి సమీపంలో ఉన్న రైతు పెద్దబచ్చగారి శ్రీధర్‌రెడ్డికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న చెట్ల కొమ్మలు, పూల మొక్కలను మేకల కాపరులు మంగళవారం వేకువజామున నరికేశారు. ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఇలా నరకడం సమంజసం కాదని మేకలను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి మేపుకోవాలన్నారు. వెంటనే ప్రజాప్రతినిధులు మేకల కాపరులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి మొక్కలను నరకకుండా చూడాలని ఆయన కోరారు.
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలోని జీవదాన్ పాఠశాలలో మంగళవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా తహసీల్దార్ ప్రేమ్‌కుమార్.. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చిన్నారులు పాటలు పాడి, డ్యాన్సులు చేశారు. డీటీ శ్రీనివాస్, ప్రిన్సిపల్ బాబు, తదితరులున్నారు.
బాన్సువాడ రూరల్: సంగోజీపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం మహిళలకు ఆ గ్రామ సర్పంచ్ మంద సంగమేశ్వర్ ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఇటీవల మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలోని డ్వాక్రా మహిళలకు చీరలను ఉచితంగా పంపిణీ చేసింది. కాగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో కొంత మందికి పంపిణీ నిలిపివేశారు. పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువు దీరటంతో పంపిణీ ప్రక్రియను పునఃప్రారంభించారు. సీసీ అక్బర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
మొక్కలు, చెట్లను కాపాడండి
మొక్కలు, చెట్లను కాపాడండి


