జాతీయ రహదారిపై లారీ బోల్తా
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై మంగళవారం పైపుల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. గుజరాత్ నుంచి మద్నూర్ మీదుగా కర్నూల్‌కు స్టీల్ పైపుల లోడుతో వెళ్తున్న లారీ మండల కేంద్రంలోని పెద్ద ఎక్లార గేటు వద్ద ఎదురుగా ఉన్న లారీని ఓవర్‌టేక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.
● నేడు రీపోస్టుమార్టం చేయనున్న పోలీసులు
మాక్లూర్: మండలంలోని బోర్గాం(కె) గ్రామానికి చెందిన పల్నాటి రమేశ్(35) ఈ నెల 19న గుండెపోటుతో మృతి చెందాడు. తన అన్న మృతిపై అనుమానాలు ఉన్నాయంటు ఇజ్రాయిల్‌లో ఉంటున్న అతని తమ్ముడు పల్నాటి కేథర్ మంగళవారం స్వగ్రామానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపడుతున్నామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రమేశ్ మృతదేహాన్ని పూడ్చిన చోట బుధవారం రీ పోస్టుమార్టం చేయనున్నట్లు మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వద్ద ఉన్న పురాతన మైసమ్మ ఆలయం ధ్వంసానికి దుండగులు యత్నించారు. గుడిని పాక్షికంగా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న వీహెచ్‌పీ, హిందూవాహిని, భజరంగ్‌దళ్ నాయకులు గుడి వద్దకు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. గతంలో కూడా ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి రెండు సార్లు ప్రయత్నాలు జరిగాయని, పోలీసులు ప్రతీ రోజు పెట్రోలింగ్ చేపట్టాలని కోరారు. ధ్వంసానికి పాల్పడిన వ్యక్తులను తక్షణమే గుర్తించి, కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. నాయకులు పుల్లూరి సతీశ్, నరేశ్, రమేశ్, నరేశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
సదాశివనగర్: ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కిందపడి తీవ్రగాయాలైన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్ మంగళవారం తెలిపారు. మండలంలోని తిమ్మోజివాడి గ్రామానికి చెందిన గోల్కొండ హరిబాబు(31) ఈ నెల 20న బైక్‌పై స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.
జాతీయ రహదారిపై లారీ బోల్తా
జాతీయ రహదారిపై లారీ బోల్తా


