సర్పంచ్‌ వేతనం మందిరానికి విరాళం | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ వేతనం మందిరానికి విరాళం

Dec 23 2025 7:16 AM | Updated on Dec 23 2025 7:16 AM

సర్పం

సర్పంచ్‌ వేతనం మందిరానికి విరాళం

సర్పంచ్‌ వేతనం మందిరానికి విరాళం క్రీడల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు నిజాయితీ చాటుకున్న మున్సిపల్‌ కార్మికుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిట్లం మండలం అధ్యక్షులుగా సన్నపుల్ల కృష్ణ సామూహిక మండల పడిపూజ

బాన్సువాడ రూరల్‌: మండలంలోని సంగోజీపేట్‌ గ్రామ సర్పంచ్‌గా సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన మంద సంగమేశ్వర్‌ తనకు వచ్చే గౌరవ వేతనాన్ని గ్రామంలోని హనుమాన్‌ మందిరానికి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. నెలనెలా వచ్చే వేతనాన్ని హనుమాన్‌ మందిరంలో ధూపదీప నైవేద్యాలకు వినియోగించాలని గ్రామస్తులకు సూచించారు. నెలకు రూ.6500 ,చొప్పున 5ఏళ్లలో రూ. 3.90లక్షలు ఆలయానికి సమకూర్చుతున్నట్లు సంతకం చేసిన వాంగ్మూళ పత్రాన్ని గ్రామస్తులకు అందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌హరినాయక్‌, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

లింగంపేట(ఎల్లారెడ్డి): నిజామాబాద్‌ నగరంలో నిర్వహించిన క్రీడల్లో లింగంపేట మండల కేంద్రానికి చెందిన మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. బాల్‌ బ్యాడ్మింటన్‌, హ్యాండ్‌బాల్‌, వాలీబాల్‌, కబడ్డీ పోటీల్లో ప్రతిభ చాటి ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ వెంకట్రాములు తెలిపారు. 13 మంది విద్యార్థులు తమ ప్రతిభను చాటి రాష్ట్ర స్థాయిలో ఆడనున్నట్లు తెలిపారు. అలాగే మార్చ్‌ఫాస్ట్‌లో తృతీయ స్థానం సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను, వ్యాయామ ఉపాధ్యాయుడు రవీందర్‌సింగ్‌లను పాఠశాల సిబ్బంది అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల సమన్వయకర్త రామ్‌గోపాల్‌, సిబ్బంది పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌: మున్సిపల్‌ కార్మికుడు తన నిజాయితీని చాటుకున్నాడు. పొరపాటున తన ఖాతాలో జమైన నగదును వెతికి పట్టుకుని మరీ బాధితుడికి అందించి మానవత్వాన్ని చాటాడు. వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రం చైన్నె గ్రామానికి చెందిన నవీన్‌బాబు జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో ఇంగ్లీష్‌ టీచర్‌గా పని చేస్తున్నాడు. కాగా ఆయన పొరపాటున రూ. 9వేలను ఫోన్‌పే ద్వారా కామారెడ్డి మున్సిపల్‌లో వాటర్‌వర్క్స్‌లో పని చేస్తున్న కార్మిక సంఘ నాయకుడు నర్సింగ్‌రావు ఖాతాకు పంపించారు. తన ఖాతాలో జమైనట్లు గమనించిన నర్సింగ్‌రావు వెంటనే సదరు ఫోన్‌ నంబర్‌ ఆధారంగా వివరాలు సేకరించి నవీన్‌బాబు ఇంటికి వెళ్లి మరీ తన వద్ద ఉన్న రూ. 9వేలను తిరిగి అందజేశా రు.దీంతో నర్సింగ్‌రావుకు నవీన్‌బాబు, ఆయ న కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

పిట్లం(జుక్కల్‌): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిట్లం మండల అధ్యక్షుడిగా సన్నపుల కృష్ణను, పట్టణ అధ్యక్షులుగా గుర్రపు బాలరాజును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారికి నియమక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాముని సుదర్శన్‌, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతల శంకర్‌ నేత, జిల్లా సోషల్‌ మీడియా ఇన్‌చార్జి రాజేందర్‌, జిల్లా యువజన విభాగం కార్యదర్శి మహేశ్‌ బాబు, కామారెడ్డి టౌన్‌ మహిళా అధ్యక్షురాలు సునీత తదితరులు పాల్గొన్నారు.

బిచ్కుంద(జుక్కల్‌): మండల కేంద్రం గోపన్‌పల్లి చౌరస్తా వద్ద గల అయ్యప్ప ఆలయంలో సోమవారం సామూహిక మండల పడిపూజ వైభవంగా నిర్వహించారు. బండయప్ప మఠం పీఠాధిపతి సోమయప్ప స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మాలాధారణ స్వాములు ఉత్సవ విగ్రహాలతో ర్యాలీ నిర్వహించారు.

సర్పంచ్‌ వేతనం  మందిరానికి విరాళం 
1
1/4

సర్పంచ్‌ వేతనం మందిరానికి విరాళం

సర్పంచ్‌ వేతనం  మందిరానికి విరాళం 
2
2/4

సర్పంచ్‌ వేతనం మందిరానికి విరాళం

సర్పంచ్‌ వేతనం  మందిరానికి విరాళం 
3
3/4

సర్పంచ్‌ వేతనం మందిరానికి విరాళం

సర్పంచ్‌ వేతనం  మందిరానికి విరాళం 
4
4/4

సర్పంచ్‌ వేతనం మందిరానికి విరాళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement