ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● ప్రజావాణికి 60 ఫిర్యాదులు
కామారెడ్డి క్రైం: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను ఎ ప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సో మవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 60 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది ప్రజలు త మ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రతి సోమ వారం కలెక్టరేట్‌కు వస్తుంటారన్నారు. ఆయా శాఖ ల అధికారులు వచ్చిన ఫిర్యాదులను విచారించి వీలైనంత త్వరగా పరిష్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకూడదని ఆదేశించారు. ఎ న్నికల కోడ్ ముగిసిందని,యధావిధిగా ప్రజావా ణి కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందన్నా రు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, జెడ్పీ సీఈఓ చందర్ నాయక్, ఏవో మస్రూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


