నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● విపత్తులపై జిల్లాకేంద్రంలో మాక్ డ్రిల్
కామారెడ్డి అర్బన్: వరదలు, విపత్తులు, ప్రమాదాలు ఏ సమయంలో వచ్చిన ప్రభుత్వ యంత్రాంగం సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సోమవారం జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ, హోంశాఖ సహకారంతో కామారెడ్డి పెద్ద చెరువు గంగమ్మ గుడి వద్ద విపత్తుల నిర్వహణ మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రజలను అప్రమత్తం చేసే ఈవోసీ సందేశాలు, సైరన్లు, ప్రజలను హెచ్చరించడం, వైర్‌లెస్ సేవలువంటి ప్రత్యామ్నాయ సమాచార వ్యవస్థలను పరీక్షించారు. ప్రాథమిక నష్టం అంచనాలు వేయడం, అధిక ప్రమాద ప్రాంతాల నుంచి ప్రజల తరలింపు, డ్రోన్ ద్వారా సేవలు అందించడం, ఎన్‌సీసీ, హోంగార్డు, వలంటీర్ల సేవల కోసం సామాజిక ఆధారిత ప్రతిస్పందన వ్యవస్థను సక్రియం చేయడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, సబ్‌కలెక్టర్ కిరణ్మయి, జిల్లా ఫైర్ అధికారి సుధాకర్, పల శాఖల అధికారులు పాల్గొన్నారు.
నిరంతరం అప్రమత్తంగా ఉండాలి


