‘పరిషత్ ఎన్నికలలోనూ సత్తా చాటుదాం’
నిజాంసాగర్: పంచాయతీ ఎన్నికల మాదిరిగానే రానున్న మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలోనూ సత్తా చాటాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం మహమ్మద్‌నగర్ మండలం తుంకిపల్లి గ్రామంలో పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం వల్లే పంచాయతీ ఎన్నికల్లో విజయాలు సాధించామన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమావేశంలో పిట్లం ఏఎంసీ చైర్మన్ మనోజ్‌కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, డీఎస్‌ఆర్ ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, తుంకిపల్లి సర్పంచ్ రాములు, నాయకులు ప్రజా పండరి, లోక్యానాయక్, కృష్ణ, శంకర్, గోపిసింగ్ తదితరులు పాల్గొన్నారు.
మాచారెడ్డి/కామారెడ్డి టౌన్: మాచారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న తగిరంచ శ్రావ్య హాకీ రాష్ట్ర జట్టుకు ఎంపికై ంది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో ప్రతిభ చూపడంతో ఆమెను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారని కళాశాల ప్రిన్సిపల్ యాకినుద్దీన్ తెలిపారు. జనవరి 2 నుంచి 7 వరకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొంటుందని పేర్కొన్నారు. ఆమెను జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు నీలం లింగం, కార్యదర్శి ఆంజనేయులు, కోశాధికారి మధుసూదన్‌రెడ్డి, కళాశాల స్పోర్ట్స్ ఇన్‌చార్జి నీలం నర్సింలు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.
మాచారెడ్డి: మర్రితండాలో సోమవారం ఓ దూడపై అడవి జంతువులు దాడి చేసి కొరికి చంపాయి. అయితే పెద్దపులి లేదా చిరుత దాడిగా గ్రామస్తులు అనుమానించారు. అటవీశాఖ మాచారెడ్డి డిప్యూటీ రేంజ్ అధికారి రమేశ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి దూడపై దాడి చేసింది పులి కాని, చిరుత కాని కాదని పేర్కొన్నారు. ఏదో అడవి జంతువులు దాడిచేయడం వల్లే దూడ మృతిచెంది ఉంటుందన్నారు.
‘పరిషత్ ఎన్నికలలోనూ సత్తా చాటుదాం’


