
‘దేశాభివృద్ధిలో ఎల్‌ఐసీ పాలసీదారులు’
కామారెడ్డి అర్బన్: ఎల్‌ఐసీ పాలసీలు తీసుకున్న ప్రతి పాలసీదారుడు ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశాభివృద్ధికి తన వంతు ఆర్థిక సహకారం అందిస్తున్నారని ఎల్‌ఐసీ కామారెడ్డి శాఖ మేనేజర్ ఎస్.కృష్ణమోహన్, ఐడీబీఐ కామారెడ్డి శాఖ మేనేజర్ రాజు అన్నారు. సోమవారం ఎల్‌ఐసీ సంస్థ 69వ వ్యవస్థాపక దినోత్సవం, బీమా వారోత్సవాలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఐడీబీఐ మేనేజర్ రాజు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఎల్‌ఐసీ మేనేజర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ..గత ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ తన లాభంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.7,324 కోట్లను డివిడెండ్ రూపంలో చెల్లించిందని, పరోక్షంగా రూ. వేల కోట్ల పన్నులు చెల్లిస్తుందని అన్నారు.
ఎల్‌ఐసీ ప్రాత కీలకం
కామారెడ్డి అర్బన్: ప్రతి భారతీయుడు ఎల్‌ఐసీ పాలసీని తీసుకోవాలని, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ కె.విజయ్‌కుమార్ అన్నారు. ఎల్‌ఐసీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కళాశాల కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఆధ్వర్యంలో ఎల్‌ఐసీ డే కార్యక్రమం నిర్వహించారు. వివిధ రకాల బీమా పాలసీపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.