
హెలీప్యాడ్ స్థల పరిశీలన
లింగంపేట/తాడ్వాయి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర బుధవారం లింగంపేట మండలంలో పర్యటించారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎర్రాపహాడ్ శివారులో ఏర్పా టు చేసిన హెలీప్యాడ్‌ను పరిశీలించి అధికా రు లకు సూచనలిచ్చారు. లింగంపల్లి(ఖుర్దు) వద్ద పాముల వాగు వంతెనను ముఖ్యమంత్రి పరిశీలించనున్న నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. వంతెన వద్ద జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రికి వివరించడానికి సిద్ధంగా ఉండాలని ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. బూరుగిద్ద శివారులో పంటలు పరిశీలించే సమయంలో నష్టాన్ని వివరించేందుకు వ్యవసాయాధికారులు సన్నద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ కిరణ్మయి, అసిస్టెంట్ ఎస్పీ చైతన్యరెడ్డి, అడిషనల్ కలెక్టర్ చందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.