
ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక
జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు ఉత్తమ టీచర్లుగా ఎంపికయ్యారు. ఇందులో రాజంపేట మండలం పొందుర్తి యూపీఎస్‌లో ఎస్‌జీటీగా పనిచేస్తున్న స్వామి, గాంధారి మండలం ప్రైమరీ స్కూల్ టీచర్ భూంపల్లి భవాని, కామారెడ్డిలోని డెయిరీ టెక్నాలజీ కళాశాల అసోసియేట్ డీన్ సురేశ్ రాథోడ్ ఉన్నారు. – కామారెడ్డిటౌన్/గాంధారి
గాంధారిలోని బాలికల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు బి.భవాని ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ఆమె ఈ పాఠశాలకు 2018 లో టీచర్‌గా వచ్చారు. అప్పట్లో 40 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. అంకిత భావంతో పనిచేస్తూ విద్యార్థులకు చక్కగా పాఠాలు చెబుతుండడంతో క్రమంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. బొమ్మలు, డ్రాయింగ్, ఆటలు, పాటలతో పాఠాలు బోధిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. అబాకస్ కూడా నేర్పిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి కాలంలో భరత నాట్యం, కర్ణాటక సంగీతం నేర్చుకున్న ఆమె.. విద్యార్థులకు నేర్పిస్తున్నా రు. విద్యార్థులకు పాఠాలు చెబుతూ యూట్యూబ్ లో అప్‌లోడ్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె కృషితో ప్రస్తుతం ఈ స్కూల్‌లో 140 మంది విద్యార్థులున్నారు. ప్రజాప్రతినిధుల పిల్లలూ ఇక్కడ చదు వుతున్నారు. ప్రభుత్వం బెస్ట్ టీచర్‌గా ఎంపిక చేసినందుకు ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు.