
మూత‘బడి’ని తెరిపించి..
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై న ఎం.స్వామి 2019 నుంచి 2024 వరకు భిక్కనూరు మండలం శివాయిపల్లిలో ఎస్‌జీటీగా పనిచేశారు. ఆయన ఈ పాఠశాలకు రాకముందు బడి మూతబడింది. తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులు బడిలో చేర్పించేలా చూశారు. తన ఇద్దరు కూతుళ్లను సైతం ఇదే బడిలో చేర్పించి చదివించారు. కూతురు లాస్యశ్రీ ఐదో తరగతివరకు ఇక్కడే చదివి ఆరో తరగతికి నవోదయ విద్యాలయానికి ఎంపికయ్యింది. కుమారుడు దివిత్ ఐదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. ప్రస్తుతం ఏడో తరగతి ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్నాడు. ఆయన పనిచేసిన సమయంలో ఈ పాఠశాల విద్యార్థులు 60 మంది నవోదయకు ఎంపికవడం గమనార్హం. ప్రస్తుతం రాజంపేట మండలంలోని పొందుర్తిలో పనిచేస్తున్న ఆయనను రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేయడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.