
వందేళ్ల కింద నిర్మించినా..
పోచారం ప్రాజెక్టును 103 ఏళ్ల కింద రూ. 26 లక్షలతో నిర్మించినా అది ఇంతటి వరదలను తట్టుకుని నిలబడడం మజ్‌బూత్‌గా ఉందని సీఎం పేర్కొన్నారు. జిల్లాలో వరదలతో దెబ్బతిన్న చెరువులు, కుంటలు, రోడ్లకు మరమ్మతులు చేయిస్తానన్నారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని పేర్కొన్నారు. ‘‘మంచిగా ఉన్నపుడు కాదు, కష్టం వచ్చినపుడు వెన్నంటి నిలబడేవాడే నాయకుడు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వరదల సమయంలో ప్రజలకు అండగా నిలిచారు’’ అంటూ అభి నందించారు. విపత్తులు తలెత్తినపుడు అంద రూ మానవత్వంతో వ్యవహరించాలని సూ చించారు. బాధితులకు భరోసా ఇవ్వడం, వారిని కాపాడుకోవడానికి ఎవరి స్థాయిలో వారు ప్రయత్నించాలన్నారు.