ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ ఆర్‌ఐ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ ఆర్‌ఐ

Sep 4 2025 10:37 AM | Updated on Sep 4 2025 10:37 AM

ఏసీబీ

ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ ఆర్‌ఐ

ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ ఆర్‌ఐ వరద బాధితులకు పరామర్శ నిత్యావసర కిట్ల పంపిణీ ‘ఒక ఆలోచన జీవితాన్నే మారుస్తుంది’ పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ స్టేషన్ల జాబితా

ఆర్మీ జవాన్‌ నుంచి రూ. 7 వేలు

లంచం తీసుకుంటూ..

నిజామాబాద్‌ సిటీ: వీఎల్‌టీ (వెకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌) సర్టిఫికెట్‌ కోసం రూ.7 వేలు లంచం తీసుకుంటూ నిజామాబాద్‌ నగర పాలక సంస్థ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కాడు. వివరాలి లా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌కు చెందిన ఆర్మీ జవాన్‌ ఒకరు ఖాళీ స్థలంలో జ్యూస్‌సెంటర్‌ కోసం అనుమతులు తీసుకున్నాడు. దీనికి సంబంఽధించిన వీఎల్‌టీ (వెకెంట్‌ లాండ్‌ ట్యాక్స్‌) సర్టిఫికెట్‌ కోసం బల్దియాలో దరఖాస్తు చేసుకొని ఫీజు చెల్లించాడు. కానీ అనుమతి పత్రం ఇచ్చేందుకు ఆర్‌ఐ శ్రీనివాస్‌ రూ.12 వేలు డిమాండ్‌ చేశారు. తాను ఆర్మీ జవాన్‌ అని చెప్పినా ససేమిరా అన్నాడు. ఆర్మీ అయితే బోర్డర్‌ లో.. ఇక్కడ డబ్బులిస్తేనే పనులు అవు తా యి అనడంతో జవాన్‌ ఆత్మాభిమానం దెబ్బ తింది. చివరకు రూ.10 వేలు ఇస్తానని ఒప్పుకొని ఏసీబీని ఆశ్రయించాడు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బల్దియాలోని రెవెన్యూ కార్యాలయం వద్ద ఆర్మీ జవాన్‌ వద్ద రూ.7 వేల నగదును ఆర్‌ఐ శ్రీనివాస్‌ తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ లక్ష్మీకాంత్‌రెడ్డి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌కు సమాచారం ఇచ్చి, ఆర్‌ఐ శ్రీనివాస్‌ను ఏసీబీ కోర్టుకు తరలించారు.

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలోని జీఆర్‌ కాలనీ, హౌసింగ్‌బోర్డు కౌండిన్య కాలనీలలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ బుధవారం పర్యటించారు. వరద బాధిత కుటుంబాలతో మాట్లాడారు. బాధితులను ప్రభు త్వం ఆదుకుంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి గురువారం జీఆర్‌ కాలనీ, కౌండిన్య కాలనీలలో పర్యటించి బాధితులతో మాట్లాడతారన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, నాయకులు పండ్ల రాజు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌: జిల్లాకేంద్రంలోని వరద బాధితులకు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి బుధవారం నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన అభ్యర్థన మేరకు బాలవికాస అమెజాన్‌ సంస్థ నిత్యావసర సరుకుల తో కూడిన 400 కిట్లను అందజేసిందన్నారు.

కామారెడ్డి అర్బన్‌: ఒక ఆలోచన జీవితాన్నే మార్చివేస్తుందని కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. కళాశాల టీఎస్‌కేసీ ఆధ్వర్యంలో బుధవారం ఇన్నోవేషన్‌ ఐడియాస్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ ప్రతి వ్యక్తిలో ఏదో ఒక సృజనాత్మక ఆలోచన దాగి ఉంటుందని, దాన్ని వెలికితీసి కొత్త ఆవిష్కరణలు చేస్తే జీవితం మారిపోతుందన్నారు. టాస్క్‌ ఐడియాథాన్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ బాలు ప్రవరాఖ్య, యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ప్రతినిధి సంకీర్త్‌, సమన్వయకర్త రాజ్‌గంభీర్‌రావు, అధ్యాపకులు ఫర్హీన్‌ ఫాతిమా, మెంటార్‌ అజారొద్దీన్‌, టాస్క్‌ జిల్లా మేనేజర్‌ రఘుతేజ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సాధారణ ఎన్నికల కోసం పోలింగ్‌ స్టేషన్ల ముసాయిదా జాబితాను ఈనెల 6న ప్రదర్శిస్తామని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 8న ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి అభ్యంతరాలు, సలహాలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. 9న అభ్యంతరాలను పరిష్కరించి, 10న ఆయా మండలాల ఎన్నికల అధికారులు పోలింగ్‌ స్టేషన్లవారీగా తుది జాబితాను ప్రకటిస్తారని తెలిపారు. ఎంపీడీవో కార్యాలయాల్లో సమావేశాలు, జాబితా ల ప్రదర్శన ఉంటాయదని పేర్కొన్నారు.

ఏసీబీకి చిక్కిన  మున్సిపల్‌ ఆర్‌ఐ 1
1/2

ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ ఆర్‌ఐ

ఏసీబీకి చిక్కిన  మున్సిపల్‌ ఆర్‌ఐ 2
2/2

ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ ఆర్‌ఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement