
ఆల్ టైం రికార్డుకు బంగారం
● 10 గ్రాముల ధర రూ.లక్షా 10 వేలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: బంగారం ధరలు మరింతగా పెరిగి ఆల్‌టైం రికార్డుకు చేరింది. మార్కెట్‌లో శుక్రవారం 10 గ్రాముల ధర రూ.లక్షా 10 వేలు దాటింది. దీంతో బంగారం అంటేనే జనం బెంబేలెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది. రూ.లక్షకు చేరినప్పటి నుంచి బంగారం కొనుగోళ్లు తగ్గాయి. ఇప్పుడు ఏకంగా రూ.లక్షా పది వేలు దాటడంతో కొనే పరిస్థితి లేదంటున్నారు. ఇదే సమయంలో అడ్డగోలుగా పెరుగుతున్న ధరలతో బంగారం ఆభరణాలు తయారు చేసి జీవనం సాగించే స్వర్ణకారులకు పని కరువవుతోంది.
నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
● జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
మద్నూర్(జుక్కల్): ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో భారీగా పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మండలంలోని గోజేగావ్ శివారులో దెబ్బతిన్న పంటలను, లెండి వాగును శుక్రవారం ఎమ్మెల్యే పరిశీలించారు. లెండి వాగు వరద నీరు, వర్షాల వల్ల పంట మొత్తం నీటిలో మునిగిపోయిందని రైతులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వంద శాతం పంటలు దెబ్బతిన్నాయని రైతులు వివరించారు. అనంతరం మండల కేంద్రంలోని శ్రీకుమార్ గణేశ్ మండలి వద్ద ఎమ్మెల్యే పూజలు చేశారు. నిర్వాహకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులకు అన్నం వడ్డించారు.
సరిహద్దు చెక్‌పోస్ట్‌లో
నిఘా పెంచండి
● జిల్లా ఇన్‌చార్జి ఎకై ్సజ్ ఈఎస్
హన్మంత్‌రావ్
మద్నూర్(జుక్కల్): చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది నామమాత్రంగా తనిఖీలు చేయకుండా పకడ్బందీగా విధులు నిర్వహించాలని, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం, మత్తు పదార్థాలు తరలకుండా నిఘా పెంచాలని జిల్లా ఇన్‌చార్జి ఎకై ్సజ్ ఈఎస్ హన్మంత్‌రావ్ ఆదేశించారు. మండలంలోని సలాబత్‌పూర్ వద్ద గల అంతర్రాష్ట్ర ఎకై ్సజ్ చెక్‌పోస్ట్ వద్ద మహారాష్ట్ర నుంచి వస్తున్న వాహనాలను నిలిపి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెక్‌పోస్ట్ వద్ద 24 గంటల పాటు తనిఖీలు చేపట్టాలని స్థానిక ఎకై ్సజ్ అధికారులకు సూచించారు. అక్రమ మద్యంతో పాటు మత్తు పదార్థాలు తరలకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. సలాబత్‌పూర్ ఎకై ్సజ్ సీఐ జావీద్ అలీ, సిబ్బంది ఉన్నారు.
మిలాద్ ఉన్ నబీ
సందర్భంగా రక్తదానం
కామారెడ్డి అర్బన్: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా శుక్రవారం కామారెడ్డి మర్కజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ మదీనా మసీదులో రక్తదాన శిబిరం నిర్వహించారు. వంద మంది ముస్లింలు రక్తదానం చేశారు. ఇందులో తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులకు 60 యూని ట్లు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి 40 యూనిట్ల రక్తం ఇచ్చారని రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా సమన్వయకర్త బాలు తెలిపారు. ఐదేళ్లుగా ప్రతియేడు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా రక్తదానం చేయడం అనవాయితీగా పెట్టుకుని ఇప్పటికి 650 యూనిట్లు రక్తం ఇచ్చారన్నారు. దాతలకు ప్రశంసాప్రతాలు అందజేశారు. రక్తదాతల సమూహం అధ్యక్షుడు జమీల్ హైమద్, ఉపాధ్యక్షులు గంప ప్రసాద్, శ్రీనివాస్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

ఆల్ టైం రికార్డుకు బంగారం

ఆల్ టైం రికార్డుకు బంగారం