హాజరు మెరుగు కోసమే ‘ఎఫ్‌ఆర్‌ఎస్‌’ | - | Sakshi
Sakshi News home page

హాజరు మెరుగు కోసమే ‘ఎఫ్‌ఆర్‌ఎస్‌’

Sep 6 2025 5:33 AM | Updated on Sep 6 2025 5:33 AM

హాజరు మెరుగు కోసమే ‘ఎఫ్‌ఆర్‌ఎస్‌’

హాజరు మెరుగు కోసమే ‘ఎఫ్‌ఆర్‌ఎస్‌’

ప్రస్తుతం విద్యార్థులకే...

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో

యాప్‌ ద్వారా విద్యార్థుల హాజరు నమోదు

హాజరును యాప్‌ ద్వారా పర్యవేక్షిస్తున్న రాష్ట్ర ఇంటర్‌ బోర్డు అధికారులు

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి) : జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని మె రుగుపర్చేందుకు అధికారులు ఎఫ్‌ఆర్‌ఎస్‌(ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టం)ను అమలు చేస్తున్నారు. గతంలో కళాశాలల్లో విద్యార్థుల హాజరును రిజిష్టర్‌లో నమోదు చేసేవారు. ప్రస్తుతం ప్రత్యేకమైన యాప్‌ ఎఫ్‌ఆర్‌ఎ స్‌ ద్వారా నమోదు చేస్తున్నారు. కొంతకాలంగా ఇంటర్‌ పరీక్షల్లో చాలామంది విద్యార్థులు ఫెయిలవుతున్నారు. తరగతులకు సక్రమంగా హాజరు కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని గ్రహించిన ఉ న్నతాధికారులు ప్రతి ప్రభుత్వ కళాశాలలో వి ద్యార్థులకు హాజరు నమోదుకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ను ప్రవే శపెట్టారు. ఈ క్రమంలో జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల హాజరును గత నెల 26 నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్‌లో నమోదు చేస్తున్నారు.

భారీ వర్షాలతో ఆటంకం..

ఇటీవల జిల్లాలో కురిసిన భారీవర్షాలతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఎఫ్‌ఆర్‌ఎస్‌లో హాజరు నమోదు ప్రక్రియకు కొంత ఆటంకం కలిగింది. జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సుమారు 6 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చాలామంది విద్యార్థులు కళాశాలలకు రాలేకపోతున్నారు. దీనివల్ల విద్యార్థులందరి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తికాలేదు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఎఫ్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ పకడ్బందీగా అమలు కానుంది. నూతన హాజరు విధానం అమలులో భాగంగా కళాశాలల్లో ప్రతిరోజూ ఉదయం విద్యార్థుల ఫొటోలను ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేసి హాజరును నమోదు చేస్తున్నారు. ఈ హాజరును రాష్ట్ర ఇంటర్‌బోర్డు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా విద్యార్థులు వరుసగా వారం రోజులపాటు కళాశాలకు గైర్హాజరయితే రాష్ట్ర ఇంటర్‌బోర్డు అధికారులు జిల్లా ఇంటర్‌ అధికారుల ద్వారా సంబంధిత కళాశాల అధ్యాపకులను అప్రమత్తం చేస్తారు.

ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని విద్యార్థుల హాజరును మాత్రమే పర్యవేక్షించడానికి ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలోని ఎయిడెడ్‌, ప్రయివేట్‌ కళాశాలలకు సైతం ఈ విధానాన్ని విస్తరింపజేయనున్నారు. దీంతోపాటు రాబోయే రోజుల్లో కళాశాలల్లోని అధ్యాపకుల హాజరును పర్యవేక్షించడానికి కూడా ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయనున్నారు.

– షేక్‌ సలాం, జిల్లా ఇంటర్‌ విద్య

నోడల్‌ అధికారి, కామారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement