
సీఎం పర్యటనతో ఒరిగిందేమీ లేదు
● మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : వరదలతో అతలాకుతలమైన కామారెడ్డి జిల్లాకు సీఎం వస్తున్నాడంటే ఎంతో మేలు జరుగుతుందని భావించామని, కానీ ఒక్క పైసా మంజూరు చేయకుండా సీఎం పర్యటన ముగియడం విచారకరమని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డిలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణంలోని జీఆర్ కాలనీ, హౌసింగ్‌బోర్డు, కౌండిన్య కాలనీ, బతుకమ్మ కుంట, టీచర్స్ కాలనీలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వరదలతో సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డ ప్రజలకు నామమాత్రపు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. సీఎం వచ్చినపుడు తక్షణమే నిధులు మంజూరు చేయకుండా, 15 రోజులకు సమీక్షిస్తానని చెప్పడమంటే ప్రజల్ని వంచించడమేనన్నారు. చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షలు, ఇసుక మేటలు వేసిన పొలాలకు ఎకరాకు రూ.50 వేలు, దెబ్బతిన్న పంటలకు ఎకరాకు కనీసం రూ.25 వేలు ఇచ్చి ఆదుకోవాలన్నారు.

సీఎం పర్యటనతో ఒరిగిందేమీ లేదు